Shanmukh-Siri Hanmanthu: రెండు జంటలు విడిపోవడానికి కారణం అయిన బిగ్ బాస్..ఆ పాపం ఊరికే పోదు అంటూ..!
తెలుగులో బిగ్ బాస్ సీజన్ మొదలైన దగ్గర నుంచి.. అంటే మొదటి సీజన్ నుంచి నాలుగో సీజన్ వరకు ఏ జంట కూడా ఎక్కువగా ట్రోల్స్ గురి కాలేదు. సీజన్ 5లో మాత్రమే అలా జరిగింది. షణ్ముఖ్, సిరిల మధ్య వ్యవహారం ఇప్పుడు బయట ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎవరినీ అడిగినా.. వాళ్లు హౌస్ లో పెద్ద ఛండాలమే చేశారు అన్నట్లు మాట్లాడుకుంటున్నారు.
నిజానికి షణ్ముఖ్ టైటిల్ గెలవాల్సింది.. కానీ కేవలం సిరి హగ్గులు.. కిస్సుల కారణంగానే ఓ జోనర్ లో ఉంటే ప్రేక్షకులు సహించలేకపోయారు. వాళ్ల వ్యవహారాన్ని ఫ్యామిలీ సభ్యులతో చూడలేకపోయారు. దీంతో షణ్ముఖ్ కు ఓట్లు తగ్గాయి. దీంతో అదే అవకాశంగా సన్నీ కప్ ను ఎగురేసుకుపోయాడు. ఇక దీని గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. దీని అంతటికి కారణం బిగ్ బాసే అంటూ నెటిజన్లు కూడా ఆరోపిస్తున్నారు.
ఎందుకంటే.. టాప్ 5లో ఉన్న వాళ్లు ఇంటికి వెళ్లే సమయంలో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. కానీ.. సిరికు వెల్ కమ్ చెప్పడానికి ఆమె లవర్.. జోడీ.. శ్రీహాన్ ఎక్కడా కనిపించలేదు.. కారణం ఏంటి..? సేమ్ అదేవిధంగా.. షణ్ముఖ్ కూడా అంతే. అతడి లవర్.. జోడీ.. దీప్తి సునయానా కూడా ఎక్కడా కనిపించలేదు. కారణం ఏంటి.. ? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. ఇక దీప్తి తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఇలా రాసుకొచ్చింది.. ‘కనీసం నీకు నవ్వైనా ఆన్సర్ ఇచ్చుకో’.. నీకు నువ్వు ఆలోచించు అన్నట్లుగా ఆమె పోస్టు చేసింది. దీంతో.. ఒక్కసారిగా ఈ పోస్టు వైరల్ గా మారింది.
ఒక్క బిగ్ బాస్ కారణంగానే ఎంతో అన్యోన్యంగా ఉన్న రెండు జంటలు విడిపోయాయని.. బిగ్బాస్ ను ఆడేసుకుటున్నారు నెటిజన్లు.. అరేయ్ బిగ్ బాస్ గా.. ఎంత పని చేశావ్ రా.. అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో.. బయట ట్రోలింగ్స్ పై శ్రీహాన్, దీప్తి ఎలా ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. కానీ షణ్ముఖ్, సిరి హౌస్ లోపల.. ఎమోషనల్ పేరుతో.. స్నేహం అనే ముసుగులో ఇలా ఉండటం మాత్రం తప్పు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…