Nagachaitanya: మరో అడుగు ముందుకేసిన నాగచైతన్య.. ఇక తగ్గేదేలే అనే విధంగా..!
Nagachaitanya: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులకు కారణం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. వారిద్దరు విడిపోయి దాదాపు 2 నెలలకు పైగా అవుతోంది. అయినా వారి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించారు తప్ప… కారణాలు ఏమిటనేది ఇద్దరిలో ఎవ్వరూ చెప్పలేదు.. దీంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు కారణాలు రాసేస్తున్నారు.
అయితే… విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎక్కువగా ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆమె వాటిపై స్పందించారు కూడా. అవేవి పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది సమంత. ఇటీవల ఆమె పుష్ప సినిమాలో ఊ అంటావా పాట చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఆమె చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం శాకుంతలం సినిమాలో ఆమె నటిస్తోంది. ఇక నాగచైతన్య కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇటీవల లవ్ స్టోరీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత బంగార్రాజు సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం అతడు ఓ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నాడట.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్‌తో నాగ చైతన్య.. ఆ ఓటీటీలో తీసేందుకు సిద్ధం అవుతునట్లు తెలుస్తోంది.
దీనిని అమెజాన్ ప్రైమ్ లో నిర్మిస్తున్నట్లు.. సమాచారం. ఈ సిరీస్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో మూడు సీజన్లుగా తీయాలని యోచిస్తున్నారు. చైతన్య పాత్రలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉంటాయట. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన నటీనటులను త్వరలోనే ప్రకటిస్తారని టాక్. దీనిలో ఓ మహిళా ప్రధాన పాత్ర కోసం మేకర్స్ ప్రియా భవానీ శంకర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…