Pushpa-Sukumar: సోషల్ మీడియాలో సుకుమార్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు..కారణం ఏంటంటే..!
Pushpa-Sukumar: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై వసూళ్లలో సునామి స్పష్టిస్తున్న చిత్రం ‘పుష్ప: ది రైజ్. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మూడోది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. విడుదలైన ప్రతీ రాష్ట్రంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ప్రస్తుతం చిత్ర బృందం పుష్ప: ది రూల్ పార్ట్ 2 కోసం సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ పార్ట్ కొద్దిగా పూర్తి అయింది.. ఇక రెగ్యూలర్ షూటింగ్ ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని భాగాలను చిత్రీకరించారట.. అయితే వాటిన మళ్లీ రీ క్రియేషన్ చేస్తామని కూడా సుకుమార్ తెలిపాడు.
2021 డిసెంబర్ 17న మొదటి పార్ట్ ఎలా అయితే విడుదల చేశామో.. సెకండ్ పార్ట్ కూడా వచ్చే ఏడాది డిసెంబర్ 16న విడుదల చేస్తామని చెప్పాడు. ఇదిలా ఉండగా.. విడుదలైన తర్వత రోజు నుంచి ఈ సినిమా కథను ఓ జర్నలిస్టు దగ్గర కాపీ కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత మళ్లీ ఈ కథ మొత్తం ఓ వెబ్ సిరీస్ నుంచి కాపీ కొట్టారనే వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ కథ ఆధారంగా ‘పుష్ప’ను రూపొందించాడంటూ తమదైన శైలిలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
నార్కోస్ వెబ్ సిరీస్ డ్రగ్స్ మాఫియా ఆధారంగా తెరకెక్కగా.. ఇందులో డ్రగ్స్ ప్లేస్ లో ఎర్రచందనం చూపించారని ఆరోపిస్తున్నారు. ఇక పుష్ప సినిమాలో మొదటి భాగంలో మెయిన్ విలన్లుగా వ్యవహరించిన కొండారెడ్డి బ్రదర్స్ కూడా.. వెబ్ సిరీస్ లో ఆధారంగానే తీసుకున్నారన్నారు. బన్నీది తొలి ప్యాన్ ఇండియా సినిమాను ఇలా కాపీ కొట్టడం ఏంటని.. సుకుమార్ ను ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక దీనిపై సుక్కు భాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…