Aadi Reddy: ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను చేస్తూ యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో బిగ్ బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి ఒకరు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆదిరెడ్డి బెంగుళూరులో ఒక హాస్టల్ లో ఉంటూ చిన్న చితక ఉద్యోగాలు చేసుకునేవారు.
అయితే ఈయన వాయిస్ బాగా ఉండటంతో తన స్నేహితులు బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూస్తూ రివ్యూ ఇవ్వచ్చు కదా అంటూ చెప్పారు. అప్పటినుంచి ఈయన బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూస్తూ రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ప్రస్తుతం స్టార్ యూట్యూబర్ గా మారిపోయారు
ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ గురించి మాత్రమే కాకుండా ఐపీఎల్ గురించి కూడా రివ్యూ ఇస్తూ వచ్చేవారు. ఇలా వరుస వీడియోలు చేస్తూ ఈయన భారీ స్థాయిలో డబ్బు సంపాదించేవారు ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు నెలనెలా లక్షల్లో ఆదాయం అందుకున్న వారు ఒక నెలలో అయితే ఏకంగా 39 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని ఆధారాలతో సహా చూపించారు.
లక్షల్లో ఆదాయం..
ఇక త్వరలోనే బిగ్ బాస్ 8 ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఆదిరెడ్డి తన వీడియోలను మొదలుపెట్టారు అయితే బిగ్ బాస్ ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఇతర సమయాలలో కూడా ఈయనకు భారీగానే ఆదాయం వస్తుందని చెప్పాలి. మామూలు సమయంలో యూట్యూబ్ ద్వారా ఆదిరెడ్డి మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఆదాయం పొందుతారని తెలుస్తోంది. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారిపోయారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…