సరయు గురించి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందే చాలామందికి తెలుసు. ఆమె 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ లో ఎక్కువగా పాపులారటీ తెచ్చుకున్నారు. దీనిలో దాదాపు అన్ని బూతులే మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలోనే ఎక్కువ డబుల్ మీనింగ్ ఉంటాయి.. కానీ ఏదో ఒక మెసేజ్ ను ఆ వీడియో చివర్లో సందేశాత్మకంగా ఇస్తారు. ఇలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు.
ఇందులో పాపులర్ అయిన సరయు.. 19 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. కానీ ఆమె బిగ్‌బాస్ హౌస్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేక.. అందులో ఇమడలేక .. గొడవలకు దిగుతూ.. అరుస్తూ.. మొదటి వారానికే బయటకు వచ్చేసింది. ఇలా బిగ్ బాస్ 5 నుంచి మొదటి వారమే బయటకు వచ్చిన సరయు గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ గురించి చెప్పారు. తాను ఒకరిని ప్రేమించానని.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అతడితో ఏడు సంవత్సరాలు రిలేషన్ లో కూడా ఉన్నానని.. ఈ విషయం వాళ్ల కుటుంబసభ్యులకు, మా కుటుంబసభ్యులకు కూడా తెలుసు అంటూ చెప్పింది. అతడికి సర్వం అర్పించానని.. తాను వర్జిన్ కాదు అంటూ చెప్పుకొచ్చారు.
అంతలా అతడిని నమ్మాను అంటూ చెప్పారు. కానీ చివరకు కట్నం దగ్గర ఇద్దరం విడిపోయామని.. అందులో మొదట రూ.25 లక్షలు, తర్వాత కోటి.. తర్వాత ఆస్తిలో సగం అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటారో అని.. తానే మొహం మీద ‘తాను నీకు తగిన దానిని కాదు’ అంటూ చెప్పాననీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సరయు తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…