Sobha Shetty: బుల్లితెర సీరియల్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శోభా శెట్టి ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్రలో నటించినటువంటి ఈమెకు అనంతరం బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అయితే అక్కడ కూడా ఈమె మోనిత పాత్రలో పోషించినట్టు తెలుస్తుంది.
అందరి మీద పెద్ద ఎత్తున అరుస్తూ తన డామినేషన్ చూపించారు. అయితే ఈమె వ్యవహార శైలి కారణంగా పూర్తిస్థాయిలో నెగిటివిటీ ఎదుర్కొన్నారు దీంతో తనని బయటకు పంపించాలంటూ ప్రేక్షకులు కూడా డిమాండ్ చేశారు కానీ స్టార్ మా యాజమాన్యం ఈమెను సేవ్ చేస్తూ 14 వారాలపాటు హౌస్ లో కొనసాగేలా చేసిందంటూ కూడా వార్తలు వచ్చాయి.
ఇకపోతే శోభ శెట్టి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వ్యాపార రంగాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఈమె ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాను అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం కార్తీక దీపం 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సీరియల్లో తాను నటించడం లేదని నటించాలని ఎవరూ కూడా తనని సంప్రదించడం లేదు అంటూ ఈమె వెల్లడించారు.
కార్తీకదీపం 2 నో ఛాన్స్..
ఇక బిగ్ బాస్ తర్వాత తన జర్నీ గురించి మాట్లాడుతూ చాలామంది నన్ను ఇప్పటికి విలన్ గానే చూస్తున్నారు అంటూ కామెంట్లో చేశారు ఇలా బిగ్ బాస్ కారణంగా అందరూ తనని విలన్ గా చూడటం వల్ల తనకు కార్తీకదీపం 2 సీరియల్ లో అవకాశం రాలేదేమో అన్న ఉద్దేశంతోనే ఈమె కామెంట్ చేశారని, బిగ్ బాస్ కారణంగా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…