Categories: FeaturedMovie News

పచ్చిగడ్డి కూడా భగ్గుమనేలా సాగుతున్న వార్.. ప్రియా వర్సెస్ సన్నీ..!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. ఆరు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం ఏడో వారంలో అడుగుపెట్టింది. ఏడో వారానికి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తియింది. ఇందులో దాదాపు 8 మంది ఉన్నారు. ఇదిలా ఉండా.. కెప్టెన్సీ కంటెడెర్ గా అవ్వడానికి బిగ్ బాస్ ఓ గేమ్ ను ఇస్తారు.

బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ప్రభావతి అనే కోడి.. కూత పెట్టి గుడ్లు పెడుతుంది. కొన్నిసార్లు కోడిగుడ్ల వర్షం కూడా కురుస్తుంది. ఆ కోడి గుడ్లను సేకరించి వారి ముఖం ఉన్న స్టిక్కర్లను ఆ గుడ్లపై అతికించి వారి దగ్గర ఉంచుకోవాలి. ఈ టాస్క్ లోనే సన్నీ, ప్రియా మధ్య వార్ తారాస్థాయికి చేరాయి. దీనిలో అందరూ వారి వారి గేమ్ ఆడుతున్న క్రమంలో.. గుడ్ల వర్షం కురిసిన సమయంలో కొంతమంది గుడ్లను సేకరించారు.

అయితే అందులో గుడ్లను తాను(ప్రియా) దొంగతనం చేస్తాను.. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సన్నీకి సవాల్ విసురుతుంది. అనుకున్నట్లుగానే ప్రియా దొంగతనం చేస్తుంది. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డ సన్నీ తన జోలికొస్తే ఊరుకోనని వార్నింగ్‌ ఇచ్చాడు. నీ గుడ్లను తానే దొంగతనం చేశానని ప్రియ చెప్పడంతో.. ఆమెను ఏమనాలో అర్థం గాక సతమతమయ్యాడు సన్నీ.

చేతకాని వాళ్లు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడుతారు అంటూ సన్నీ అనగా.. దానికి కౌంటర్ గా ప్రియా కూడా మాట్లాడింది. ఇలా వాళ్లిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమన్నట్లు నడిచింది. ఇక ఈ రోజు వచ్చే ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోలో సన్నీ, ప్రియాలు అగ్రెసివ్ గా కనిపించారు. వారిద్దరు కొట్టుకునే దాక కూడా వెళ్లింది. చూడాలి మరి ఈ రోజు వారిద్దరి మధ్య వార్ ఏ విధంగా ఉంటుందో.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago