తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. ఆరు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం ఏడో వారంలో అడుగుపెట్టింది. ఏడో వారానికి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తియింది. ఇందులో దాదాపు 8 మంది ఉన్నారు. ఇదిలా ఉండా.. కెప్టెన్సీ కంటెడెర్ గా అవ్వడానికి బిగ్ బాస్ ఓ గేమ్ ను ఇస్తారు.

బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ప్రభావతి అనే కోడి.. కూత పెట్టి గుడ్లు పెడుతుంది. కొన్నిసార్లు కోడిగుడ్ల వర్షం కూడా కురుస్తుంది. ఆ కోడి గుడ్లను సేకరించి వారి ముఖం ఉన్న స్టిక్కర్లను ఆ గుడ్లపై అతికించి వారి దగ్గర ఉంచుకోవాలి. ఈ టాస్క్ లోనే సన్నీ, ప్రియా మధ్య వార్ తారాస్థాయికి చేరాయి. దీనిలో అందరూ వారి వారి గేమ్ ఆడుతున్న క్రమంలో.. గుడ్ల వర్షం కురిసిన సమయంలో కొంతమంది గుడ్లను సేకరించారు.
అయితే అందులో గుడ్లను తాను(ప్రియా) దొంగతనం చేస్తాను.. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సన్నీకి సవాల్ విసురుతుంది. అనుకున్నట్లుగానే ప్రియా దొంగతనం చేస్తుంది. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డ సన్నీ తన జోలికొస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. నీ గుడ్లను తానే దొంగతనం చేశానని ప్రియ చెప్పడంతో.. ఆమెను ఏమనాలో అర్థం గాక సతమతమయ్యాడు సన్నీ.
చేతకాని వాళ్లు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడుతారు అంటూ సన్నీ అనగా.. దానికి కౌంటర్ గా ప్రియా కూడా మాట్లాడింది. ఇలా వాళ్లిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమన్నట్లు నడిచింది. ఇక ఈ రోజు వచ్చే ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోలో సన్నీ, ప్రియాలు అగ్రెసివ్ గా కనిపించారు. వారిద్దరు కొట్టుకునే దాక కూడా వెళ్లింది. చూడాలి మరి ఈ రోజు వారిద్దరి మధ్య వార్ ఏ విధంగా ఉంటుందో.































