బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం నామినేషన్ ప్రక్రియలో ఎక్కువగా హైలెట్ అయిన కంటెస్టెంట్ ఉమాదేవి. ఈమె బుల్లితెరలో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంత మంచి ఫాలోయింగ్ ఉన్న ఆ సీరియల్ లో నటించిన వ్యక్తికి ఓట్లు రాకపోవడానికి గల కారణం ఏంటంటే.. ఎలిమినేషన్ లో ఆమె నోటి నుంచి వచ్చిన అసభ్యకర పదాలు. దానికి బిగ్ బాస్ కూడా ఆ పదం వచ్చినప్పుడు బీప్ వేశాడు.
అంతలా ఆమెకు ఆ సమయంలో దురదృష్టం పట్టిందనే చెప్పాలి. తర్వాత ఆమె రియలైజ్ అయి లోబోతో రొమాన్స్ ట్రాక్ నిడిపించింది. అందరితో మంచిగా మెలుగుతూ ఉన్నా.. ఆమెకు లాభం లేకుండా పోయింది. ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే ఆమె మరికొన్ని రోజులు ఆ హౌస్ లో ఉండేది.
ఫ్యామిలీ ప్రేక్షకులు ఆమెకు ఓటు వేయకపోవడానికి గల కారణం అదే అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి బాధ గానీ.. ఎలాంటి నిరుత్సాహం గానీ కనిపించలేదు. హౌస్ లో ఉన్నవాళ్లను కూడా ఎలాంటి మాట అనకుండా.. ఒకొక్కరి గురించి కుండబద్దలు కొట్టి చెప్పింది.
అందరితో వెళ్లే ముందు ప్రశంసలు పొందింది కానీ.. అప్పటికే ఆమెకు ఆలస్యం అయిపోయింది. హౌస్ లోకి వెళ్లేముందు గయ్యాళిగా పేరుపొందిన ఉమాదేవి.. హౌల్ లోకి వెళ్లాక నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్పి వెళ్లింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆమె అదే పేరుతో బయటకు రావడం వేశేషం.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…