బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షో లో మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన రియాల్టీ షో ప్రస్తుతం 16 మంది మిగిలారు. ఎవరూ ఊహించని విధంగా మూడో వారం లహరి ఎలిమినేట్ అయింది. వాస్తవానికి ప్రియా ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు.. కానీ హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యే విధంగా లహరి బయటకు వచ్చింది.
ఆమె పై అంత నెగిటివిటీ రావడానికి కారణం రవి.. ప్రియాతో అన్న మాటలే అని తెలుస్తోంది. ‘సింగిల్ మెన్’ అనే పదాన్ని యాంకర్ రవి ప్రియాతో మాట్లాడారు కాబట్టే.. ఆమె ఎలిమినేషన్ లో ప్రస్తావించాల్సి వచ్చిందంటూ ప్రియా తెలిపారు.
దీంతో కథ అంతా అడ్డం తిరిగింది. ఇదంతా ఇలా ఉండగా.. ఆమెకు బిగ్‌బాస్ షో నుంచి ఎంత ముట్టిందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఆమెకు వారానికి రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు పారితోషికంగా ఇస్తున్నారట. ఈ లెక్కన ఆమెకు మూడు వారాలకు లెక్కలు వేసుకుంటే దాదాపు రూ.5లక్షలకు పైగా సంపాదించిందంటూ చెబుతున్నారు.
అయితే నాగార్జున దగ్గరకు వచ్చిన లహరి కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించింది. తాను ఏ తప్పు చేశానో అర్థం కాలేదంటూ నాగార్జునకు తెలిపారు. ఇక బిగ్ బాస్ బజ్ లో కూడా ఒకొక్కరి గురించి ఈ అమ్ము తన అభిప్రాయాలను పంచుకుంది యాంకర్ అరియానాతో.
ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…
కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్‌ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…