Movie News

పవన్ కళ్యాణ్ కు ఎదురుదెబ్బ.. వాటితో మాకు సంబంధం లేదంటూ..

సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్… నిన్న రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. దీంతో ఏపీ మంత్రులు పవన్ పై నానా రకాలుగా మాట్లాడారు. యుద్దానికి ప్రతి యుద్దం అన్నట్లు మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది.

ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం అని స్పష్టం చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలతో ఫిలిం చాంబర్ కు సంబంధం లేదని వెల్లడించింది. చిత్ర పరిశ్రమపై ఆధారపడి వేల కుటుంబాలు ఉన్నాయని, కొందరు వ్యక్తిగత అభిప్రాయాలను పలు వేదికలపై వెల్లడిస్తున్నారని తెలిపింది.

టాలీవుడ్ పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని, అలాంటి అభిప్రాయాలతో తమకు సంబంధంలేదని ఫిలిం చాంబర్ వివరణ ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ముఖ్యమని తెలిపింది. ప్రభుత్వాల మద్ధతు లేనిది సినీ పరిశ్రమ మనుగడ సాగించడం కష్టమని స్ఫష్టం చేసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్న సందర్భంలో ఫిలిం చాంబర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సినీ రంగ ఇబ్బందులపై ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చించామని, సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తన ప్రకటనలో వెల్లడించింది. సినీ పరిశ్రమకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు అని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు సినీ పరిశ్రమకు అవసరం అంటూ కోరారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago