బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో ఒక్కసారిగా బయట ప్రపంచం చూసినంత పనైంది. ఎందుకు ఇలా అంటారా.. అదేనండి.. శనివారం, ఆదివారం రోజున నాగార్జున కంటెస్టెంట్లతో మాటా ముచ్చట ఉంటుంది కదా. అయితే ఈ రోజు టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో ఒకటి బటయటకు వచ్చింది.
వాళ్లతో నాగార్జున మాట్లాడారు. ఒక్కసారిగా వాళ్లంతా సంతోషంతో ఉబ్బితబ్బైపోయారు. రావడమే ఆలస్యం.. ఎవరు హౌస్ లో కనపడుతున్నారు.. ఎవరూ ఆట ఆడటం లేదు అనేవి గమనించి వాళ్లకు చెప్పారు. అందులో మొదట హౌస్ లో మొదటి కెప్టెన్ అయిన సిరి గురించి మాట్లాడుతూ.. కంగ్రాట్స్ అంటూ ప్రశంసించారు. అందిరికంటే చాలా బాగా ఆడింది.. దెబ్బ కూడా తగిలిందంటూ సన్నీ నాగార్జునకు చెబుతుండగా.. ఆమెకు ఉన్న ఉత్సుకత నీకు కూడా ఉంటే బాగానే ఉండేది అంటూ నవ్వుకుంటూ.. సన్నీకి చురకలు అంటించారు నాగార్జున.
హౌస్ లో మల్టీపుల్ ట్రాక్స్ నడుస్తున్నాయంటూ.. ప్రియ చెప్పారు. బిగ్‌బాస్ షోకి వచ్చీరావడంతోనే తనకు పూలబాణం వేసిన లహరితో మాట్లాడుతూ.. నీ దగ్గరున్న రోజా పువ్వును వచ్చే వారమైనా ఎవరో ఒకరికి ఇస్తావని ఆశిస్తున్నానన్నాడు. బయట నుంచి ఎవరినైనా పంపించండి సార్ అంటూ లహరి అనగా.. అక్కడ ఉన్న మగాళ్ల పరువు పోయినట్లు అయింది.
తర్వాత లోబోను ఎంటర్ టైన్ మెంట్ ఆఫ్ ది హౌస్ అంటూ ప్రశంసించారు. చివరకు ఏంట్రా అది.. ప్రేక్షకులకు కొంచెం కనపడరా.. వన్ వీక్ అయిపోయిందిరా.. ఆట మొదలు పెట్టరా.. అంటూ షణ్ముఖ్ ను ఉద్దేశించి అన్నారు నాగార్జున. ఇలా హౌస్ మొత్తం జోష్ లో కనిపించింది.
సినీ దర్శకుడు బాబీ తాజాగా పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా రంగంలో స్టార్‌గా…
తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’తో పరిచయమైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘డెకాయిట్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ…
తెలుగు సినీ పరిశ్రమలో అగ్రగామి నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తాజాగా…
సూపర్‌స్టార్ రజనీకాంత్ యువతకు సంబంధించిన కీలక అంశాలపై తాజాగా చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. యువత తప్పు దారుల్లోకి…
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన సమంత మళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీ అవుతున్నారు. కొంతకాలం ఆరోగ్య సమస్యల…
టాలీవుడ్‌లో విభిన్న కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడివి శేష్ తాజాగా తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న…