శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత ఆయనను మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం నుంచి వైద్యులు సాయిధరమ్ తేజ్ కి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరంతేజ్ వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు.
శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ మొట్టమొదటిసారిగా స్పృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది. స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ తమ కుటుంబ సభ్యులతో కేవలం వీడియో కాల్ లో చాలా నొప్పిగా ఉందంటూ ఒకే ఒక మాట మాట్లాడి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రి సిబ్బంది స్కానింగ్ నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.
అయితే ఆదివారం సాయి ధరంతేజ్ కి కాలర్ బోన్ సర్జరీ సర్జరీ నిర్వహించనున్నట్టు అపోలో వైద్యులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదం అనంతరం సాయిధరమ్ తేజ్ ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తో పాటు నటుడు నరేష్ కుమారుడు నవీన్, మరొక వ్యక్తి ముగ్గురూ కలిసి ఒకచోటకి వెళ్లినట్లు సమాచారం.
బైక్ రైడింగ్ ఆధారంగా పోలీసులు సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిన తర్వాత ప్రమాదం గురించి విచారించనునట్లు డీసీపీ తెలియచేశారు. అవసరమైతే ఈ కేసులో నటుడు నరేష్ ను ఆయన కుమారుడు నవీన్ ను పోలీసులు విచారిస్తామని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…