బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో ఒక్కసారిగా బయట ప్రపంచం చూసినంత పనైంది. ఎందుకు ఇలా అంటారా.. అదేనండి.. శనివారం, ఆదివారం రోజున నాగార్జున కంటెస్టెంట్లతో మాటా ముచ్చట ఉంటుంది కదా. అయితే ఈ రోజు టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో ఒకటి బటయటకు వచ్చింది.
వాళ్లతో నాగార్జున మాట్లాడారు. ఒక్కసారిగా వాళ్లంతా సంతోషంతో ఉబ్బితబ్బైపోయారు. రావడమే ఆలస్యం.. ఎవరు హౌస్ లో కనపడుతున్నారు.. ఎవరూ ఆట ఆడటం లేదు అనేవి గమనించి వాళ్లకు చెప్పారు. అందులో మొదట హౌస్ లో మొదటి కెప్టెన్ అయిన సిరి గురించి మాట్లాడుతూ.. కంగ్రాట్స్ అంటూ ప్రశంసించారు. అందిరికంటే చాలా బాగా ఆడింది.. దెబ్బ కూడా తగిలిందంటూ సన్నీ నాగార్జునకు చెబుతుండగా.. ఆమెకు ఉన్న ఉత్సుకత నీకు కూడా ఉంటే బాగానే ఉండేది అంటూ నవ్వుకుంటూ.. సన్నీకి చురకలు అంటించారు నాగార్జున.
హౌస్ లో మల్టీపుల్ ట్రాక్స్ నడుస్తున్నాయంటూ.. ప్రియ చెప్పారు. బిగ్‌బాస్ షోకి వచ్చీరావడంతోనే తనకు పూలబాణం వేసిన లహరితో మాట్లాడుతూ.. నీ దగ్గరున్న రోజా పువ్వును వచ్చే వారమైనా ఎవరో ఒకరికి ఇస్తావని ఆశిస్తున్నానన్నాడు. బయట నుంచి ఎవరినైనా పంపించండి సార్ అంటూ లహరి అనగా.. అక్కడ ఉన్న మగాళ్ల పరువు పోయినట్లు అయింది.
తర్వాత లోబోను ఎంటర్ టైన్ మెంట్ ఆఫ్ ది హౌస్ అంటూ ప్రశంసించారు. చివరకు ఏంట్రా అది.. ప్రేక్షకులకు కొంచెం కనపడరా.. వన్ వీక్ అయిపోయిందిరా.. ఆట మొదలు పెట్టరా.. అంటూ షణ్ముఖ్ ను ఉద్దేశించి అన్నారు నాగార్జున. ఇలా హౌస్ మొత్తం జోష్ లో కనిపించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…