మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూలో ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతుంది. అయితే అతడి ప్రమాదానికి సబంధించి పోలీసుల విచారణలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అతడు బైక్ రేసింగ్ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వారు అనుమానానించడానికి గల కారణం ఏంటంటే.. ధరమ్ తేజ్.. నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్ కృష్ట చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. అతడు ప్రమాదానికి ముందు కొన్ని గంటల ముందు నటుడు నరేశ్ ఇంటి వద్ద నుంచి బయలుదేరాడు. అక్కడ నుంచి అతడు దుర్గం చెరువువైపు పయణించాడు. ఇవన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
అయితే అతడు నవీన్ విజయ్ కృష్ణతో బైక్ రేసింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సీసీటీవీల్లో రికార్డయిన వీడియోలో రెండు బైక్ లు అతి వేగంగా వెళ్తేన్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు ప్రమాదానికి గల కారణం బైక్ రేసే అంటూ అనుమానిస్తున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే 8 గంటలకు మెడికవర్ ఆసపత్రికి తరలించగా.. అక్కడినుంచి అతనిని మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. అతడు ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.
అతడు కోలుకున్న మరుక్షణమే విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇలా వెలుగులోకి వచ్చిన బైక్ రేసింగ్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా .. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు సంబంధించి అతడిపై రాయదుర్గం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…