బిగ్ బిగ్ బాస్ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది. మరి కొద్ది రోజులలో బిగ్ బాస్ ట్రోపీని ఎవరు గెలుచుకోబోతున్నారో తెలియనుంది. అయితే బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరిగింది. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా హౌస్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో అల్లరి చేస్తూ సరదాగా ఉండే సిరి డల్ అయిపోయింది.
సిరి అలా అవ్వడానికి మూల కారణం షణ్ముఖ్ జస్వంత్ అని అభిప్రాయపడ్డారు కాజల్, మానస్.షన్ను కంటి చూపుతోనే సిరిని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె హౌస్ మేట్స్ తో ఎవరితో చనువుగా ఉన్న ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాడు. షణ్ముఖ్ వల్ల సిరి తన ఇండివిడ్యువాలిటిని కోల్పోతుందని చెప్పుకొచ్చాడు మానస్. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు గతంలో జరిగిన సీన్ లను తిరిగి ప్లే చేసే గేమ్ ను ఇచ్చాడు
ఈ క్రమంలోనే శ్రీరామ్,జెస్సీలకు కిచెన్ లో జరిగిన గొడవలు రీ క్రియేట్ చేసి చూపించాలి అన్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే టాస్క్ లో తనని చులకనగా చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు షన్ను. మాటలు అంటే పడతాను కానీ ఇమిటేట్ చేస్తే మాత్రం నచ్చదు అంటూ లోపల గొనుక్కున్నాడు. ఈ టాస్క్ లో నేను పాల్గొనను అంటూ మొండి పట్టు పట్టడంతో అతని కూల్ చేయడానికి వెళ్ళిన సిరి పై కూడా ఫైర్ అయ్యాడు.
సిరి వచ్చి సారీ చెప్పినప్పటికీ అతను వినిపించుకోకుండా..నీ వల్ల నాకు ఏమీ నెగిటివ్ లేదు నీ మంచి కోసం మాట్లాడితే నేను నెగిటివ్ అవుతున్నాను అంటూ ఆమె పై కస్సుబుస్సు లాడాడు. మిగతా కంటెస్టెంట్ అలాగే నువ్వు కూడా అంటూ, నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం మిగతా కంటెస్టెంట్ లను ఆయన, ఈయన అంటావు.. నన్నేమో ఒరేయ్ అరేయ్ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావు.. మనమిద్దరం ఉన్నప్పుడు వేరు..నలుగురిలో ఉన్నప్పుడు వేరు.. అవతలివాళ్ళు ముందు నేను తక్కువ అయినా సరే నీ కోసం ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు..హగ్ ఒకటే గుర్తు ఉంది అంటూ సిరి నానా మాటలు అనడంతో పాటు తన తల్లిని కూడా లాగడంతో సిరి ఎమోషనల్ అయిపోయింది. ఆ తర్వాత కాసేపటికి షన్ను బుజ్జ గించాడు. అలా కాసేపటికి ఇద్దరూ కలిసి పోయి హగ్గులు ఇచ్చుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…