రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం ఎంతో మంది అభిమానులు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కావడంతో నేడు ట్రైలర్ ను విడుదల చేశారు.3:16 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇందులో శ్రియ, అజయ్ దేవగన్, అలియాభట్, రామ్ చరణ్,తారక్ విశ్వరూపం చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ ట్రైలర్ లో ఫైట్ సన్నివేశాలు ఆద్యంతం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఇందులో ఎన్టీఆర్ చరణ్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
ఈ ట్రైలర్ ద్వారా సినిమా కథాంశం ఏంటి అనే విషయం కాస్త క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఎన్నో అంచనాలను పెంచుతూ సినిమా పై మరింత ఆసక్తిని కలిగించేలా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం చేసే అరాచకాలను అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ఎలా తిప్పికొట్టారు అనే సన్నివేశాలను ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…