మెగాస్టార్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకోని ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా మరో 3 సినిమాల షూటింగులో పాల్గొంటున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుని షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పాత్ర ఎంతో కీలకంగా ఉంది.అయితే ఈ పాత్రలో నటించడానికి డైరెక్టర్ బాబీ రవితేజ అయితే బాగుంటుందని భావించడంతో వెంటనే రవితేజను సంప్రదించగా రవితేజ ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని భావించిన రవితేజ మరొకవైపు బాబీతో మంచి సాన్నిహిత్యం ఉండటం వల్ల మరొక మాట మాట్లాడకుండా ఈ సినిమాకి ఓకే చెప్పారు. అయితే ఈ సినిమాలో నటించడానికి రవితేజ ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇలా రవితేజ డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు కూడా సానుకూలంగా ఉండడంతో త్వరలోనే రవితేజ మెగాస్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించిన సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత మరోసారి చిరు సినిమాలో నటించే అవకాశాన్ని రవితేజ దక్కించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…