సోనియా అగర్వాల్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు 7/G బృందావన్ కాలనీ. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంది. అంతేకాకుండా 7/G బృందావన్ కాలనీ సినిమాలో నటించి అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో అనిత అనే పాత్రలో నటించి మెప్పించింది.ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది.
ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తరువాత ఆమె తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తమిళంలో పాటు తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది.మొదట 2002లో నీ ప్రేమకై ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ఆమె సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది.
ఇక 2006లో డైరెక్టర్ సెల్వరాఘవన్ ను పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ అంత హ్యాపీగా కొనసాగుతుంది అనుకుంటున్న క్రమంలోనే ఆమె ఆ దర్శకుడుతో విడాకులు తీసుకుంది. అలా 2010 లో విడాకులు తీసుకుని అనంతరం ఒంటరిగా నివసిస్తోంది. ఆ తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలతో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి.
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోనియా రెండవ పెళ్లి పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక కొత్త రూమర్ వైరల్ గా మారింది.ఆమె ఒక యువ దర్శకుడితో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వయసు కూడా మించి పోతుండడంతో అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఆలోచిస్తోందట. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక తమిళం సినిమాతో పాటు తెలుగులో కూడా సహా నటిగా పలు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం సోనియా మళ్లీ పెళ్లి చేసుకుంటుందా? ఈ మేరకు వినిపిస్తున్న కథనాలు నిజమవుతాయా? తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…