Priyanka Jain: బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రియాంక జైన్ ఒకరు. ఇలా బుల్లితెర నటిగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా, మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఈ కార్యక్రమం అనంతరం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రియాంక జైన్ బిగ్ బాస్ శివాజీ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో అందరూ 100% కష్టపడితే నేను మాత్రం వెయ్యి శాతం కష్టపడ్డానని తెలిపారు. అయినప్పటికీ బిగ్ బాస్ వాటన్నింటిని చూపించలేదని తెలిపారు.
హౌస్ లో అందరికీ నేను రోటీలు చేసి పెట్టాను అయితే ఈ విషయంపై నన్ను తప్పు పడుతూ కామెంట్లు చేయడం చూపించారు కానీ నేను పడిన కష్టాన్ని మాత్రం చూపించలేదు నా ఆరోగ్యం బాగా లేకపోయినా పిల్స్ ఇంజక్షన్స్ వాడి మరి హౌస్ లో అందరికీ భోజనం చేశాను. ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు రోటీలు దాచి పెట్టుకున్నాను వాటిని హైలెట్ చేసి చూపించారు.
ఇంజక్షన్స్ వాడాను..
ఇలా నేను చేసినటువంటి పర్ఫామెన్స్ కష్టాన్ని బిగ్ బాస్ చూపించలేదని వాటన్నింటినీ కనుక చూపించి ఉంటే నేనే విన్నర్ అయ్యేదానిని అంటూ ప్రియాంక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే శివాజీ గారితో నేను ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసిన ఆయన మాత్రం నన్ను పక్కన పెడుతూనే వచ్చారు. అందరూ అనుకున్నట్టు ఆయన జెన్యూన్ కాదు మొదటి నుంచి కూడా మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నారని ఈ విషయం ప్రేక్షకులకు ఎందుకు అర్థం కాలేదో తెలియడం లేదు అంటూ ప్రియాంక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…