Bigg Boss 7: తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం ఇటీవల ఏడవ సీజన్ పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సీజన్లో కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి సెలబ్రిటీలను సైతం పక్కకు నెట్టి ఒక కామన్ మెన్ విజేతగా నిలవడం అనేది బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు.
అయితే గత సీజన్లో మాదిరి కాకుండా ఈసారి మాత్రం ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎవరు ఊహించని విధంగా టాస్కులను పెట్టడం ఎలిమినేషన్లలో ట్విస్టులు ఇవ్వడం వంటివి ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో టైటిల్ రేసులో అమర్ శివాజీ అర్జున్ వంటి వారు వచ్చారు.
ఇక వీరందరిని కాదని పల్లవి ప్రశాంత్ కూడా టైటిల్ రేసులోకి రావడంతో ఈ కార్యక్రమం పై ఆసక్తి నెలకొంది పల్లవి ప్రశాంత్ విజేత అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కావడంతో ఈ ట్రోఫీ ఎవరికి అందిస్తారు అన్న ఆత్రుత అందరిలోనూ కలిగింది. దీంతో ఈ ప్రభావం గ్రాండ్ ఫినాలేపై పడిందని చెప్పాలి ఈ గ్రాండ్ ఫినాలే కూడా ఎంతో ఘనంగా జరిగింది.
రికార్డ్ స్థాయిలో రేటింగ్..
ఇకపోతే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే రోజు వచ్చినటువంటి రేటింగ్ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. టెలివిజన్ రేటింగ్ లో ఏ షోకి రాని విధంగా బిగ్ బాస్ ఈ గ్రాండ్ ఫినాలే షో ఏకంగా 21.7 రేటింగ్ సంపాదించుకుందని తెలుస్తుంది. ఇలా ఒక బుల్లితెర షో ఈ స్థాయిలో రేటింగ్ సంపాదించుకుంది అంటే మామూలు విషయం కాదు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఈ సీజన్ మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే ఓటీటీ సీజన్ 2 కూడా నిర్వహించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…