Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతోంది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుందని సమాచారం. ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కంటెస్టెంట్ ఆ లిస్ట్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే కొంతమంది కంటెస్టెంట్లకు బిగ్ బాస్ వారు అఫీషియల్ మెయిల్స్ కూడా పంపించి వారిని కన్ఫామ్ చేశారంటూ మరొక లిస్ట్ వైరల్ అవుతుంది. నిజానికి ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు లాంచింగ్ ఎపిసోడ్ వరకు వారి పేర్లను రివీల్ చేయకూడదనే రూల్ ఉంటుంది. అయితే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు సంబంధించిన ఏవి ముందుగా షూట్ చేయాల్సి ఉంటుంది కనుక ఇలా ఎడిటింగ్ రూమ్ నుంచి కూడా కొన్ని లీక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోయే వారికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెళ్లడయ్యాయి. ఇప్పటికే కొంతమందికి అఫీషియల్ గా మెయిల్స్ పంపించారని తెలుస్తోంది. మరి ఎవరికి పంపించారనే విషయానికి వస్తే గత సీజన్ లో అమర్ రన్నర్ గా నిలిచారు. ఇప్పుడు ఆయన భార్య తేజస్విని గౌడ ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.
తేజస్విని గౌడ..
ఈమెకు ఇప్పటికే అఫీషియల్ గా మెయిల్ వచ్చినట్టు సమాచారం. ఇక తనతో పాటు యూట్యూబర్ బంచిక్ బబ్లూ, రీతు చౌదరి, అంజలి పవన్ కు అఫీషియల్ గా మెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది. ఇక ఆగస్టు మూడో వారంలో మరి కొంతమంది సెలబ్రిటీలను కూడా ఎంపిక చేయబోతున్నారని సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…