Categories: FeaturedMovie News

గ్లామర్ దోస్ పెంచిన బిగ్ బాస్ !! ఏ మాటకామాటే.. కలరింగ్ అదుర్స్…!!

బిగ్ బాస్ సీజన్ 4 పై అంచనాలను భారీగా పెంచేవిధంగా టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ లను రంగంలోకి దింపుతున్నారు. ఈసారి బిగ్ బాస్ షో చాలా హాట్ ఉండబోతుందని, టాలీవుడ్ లో తమ అందాల ఆరబోతతో అదరగొట్టిన భామలు ఈ షోలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. చాలా రోజుల తర్వాత బుల్లితెర ప్రేక్షకుల ముందుకొస్తున్న బిగ్ బాస్ హౌస్ ని అట్టుడికించేందుకు ఇలాంటి వేడెక్కించే కిలాడీ భామలు అవసరమని స్టార్ మా టీం భావించారట. అందుకే ట్యాలెంటును జల్లెడ వేసి వెతికి మరీ పట్టుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడం కోసం ఈ భామలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారన్న రూమర్స్ కూడా వినిపించాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజ‌న్ 4 ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా.? అని ప్రేక్ష‌కులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వారికి గుడ్ న్యూస్ చెబుతూ ఈ షోలో.. టాలీవుడ్ కింగ్ నాగార్జున‌ వృద్ధుడి గెట‌ప్‌లో క‌నిపించారు. టెలీస్కోప్‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఏం జ‌రుగుతుందో చూస్తున్న‌ట్లు బిగ్ బాస్ సీజ‌న్ 4పై ప్రేక్ష‌కుల‌కు భారీగానే ఆస‌క్తి పెరిగేలా చేశారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 4 నిర్వాహకులు మరింత పకడ్బందీగా ఎంపిక చేసిన లేడీ కంటెస్టెంట్స్‌ వివరాలు మీకోసం..

దేత్తడి హారిక –

యూట్యూబ్‌ చానల్ ‘దేత్తడి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా హారిక ఈ వెబ్ సిరీస్‌తో నెటిజన్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పదాచుకుంది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. హారిక ‘దేత్తడి’ ముందు అమెజాన్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేది అయితే.. తన ప్రతిభను నిరూపించుకోవడం కోసం ఆ ఉద్యోగాన్నివదిలేసింది. ప్రస్తుతం హారిక చేసే ‘దేత్తడి’ యూట్యూబ్ చానెల్‌కు 10 లక్షలకు వరకు సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం.

దివి వద్యా

మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో చలన చిత్ర రంగంలోకి వచ్చింది దివి. సినిమాలంటే ఆమెకు చాలా ఇష్టం. తన ఫ్యామిలీ కూడా ఆమె ఇష్టాలను గౌరవించారు. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసిన దివి లేటెస్ట్ గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దివి తల్లి, సోదరుడు డాక్టర్లుగా సేవలందిస్తున్నారు.

అరియానా గ్లోరీ

ఈమె అసలు పేరు మంగలి అర్చన. 1993 జనవరి 25న జన్మించిన అర్చన వికారాబాద్‌లోని తాండూరులో పుట్టి పెరిగింది. యాంకర్ కావాలనే ఆసక్తితో డిగ్రీ ఫెయిల్ అయిన అరియానా.. 2014లో హైదరాబాద్ వచ్చి యాంకర్‌ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలే చేసింది. ఆఖరికి ఎక్కడా ఛాన్స్ లు రాకపోవడంతో సంవత్సరం పాటు నానా ఇబ్బందులు పడిన అర్చన 2015లో స్టుడియో వన్ ఛానల్‌తో యాంకర్‌గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత 2016 నుంచి ఈటీవీ అభిరుచి కార్యక్రమంలో ముగ్గురు యాంకర్లలతో పాటుగా తాను ఓ యాంకర్ గా ఘుమ ఘుమలాడించింది. అయితే మధ్యలో జెమిని కామెడీ ఆడిషన్స్‌కి వెళ్లగా హోల్డ్‌లో పెట్టి.. 2017లో యాంకర్‌గా ఛాన్స్ ఇవ్వడంతో అప్పటి నుంచి జెమిని కామెడీ ఛానల్ లో యాంకర్‌గా కంటిన్యూ అవుతుంది అరియానా గ్లోరీ. ఫ్రీలాన్సర్‌గా చాలా యూట్యూబ్ ఛానల్‌లకి ఇప్పటి వరకూ 500 మందికి పైగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలను చేసింది అరియానా. అయితే వర్మ ఇంటర్వ్యూలోని బోల్డ్ కామెంట్స్‌తో బోల్డ్ యాంకర్‌గా పేరొందిన మన తాండూరు అర్చన లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది .

మోనాల్ గ‌జ్జ‌ర్

‘సుడిగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయమైన హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ సినిమాల్లోకి రాక‌ముందు ఒక ప్రైవేటు బ్యాంకులో ప‌ని చేసింది. మిస్ గుజ‌రాత్ కిరీటాన్ని ద‌క్కించుకున్న ఈ అందాల భామ ద‌క్షిణాదిన తెలుగు, తమిళ‌, మళయాళం, గుజరాతీ చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. బ్ర‌ద‌రాఫ్ బొమ్మాళి సినిమాలో చివ‌రిసారిగా క‌నిపించిన మోనాల్ గ‌జ్జ‌ర్ బాలీవుడ్‌లోనూ 2 చిత్రాలలో నటించింది. లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్‌ 4లో ఎంటర్ అయిన వ‌న్‌ అండ్ ఓన్లీ హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌.

జోర్దార్ సుజాత

శ్రుతి అంటే ఎవ‌రూ గుర్తుపట్టకపోవ‌చ్చు కానీ, జోర్దార్ సుజాత అంటే చాలు.. ఠక్కున గుర్తుప‌ట్టేస్తారు. ప‌ల్లెటూరులో పెరిగిన శ్రుతి స‌ర్కార్ బ‌డిలో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చదివింది. పై చ‌దువులు పూర్త‌య్యాక‌ ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో జాబ్ చేసింది. తెలంగాణ యాస‌లో ఓ ప్రోగ్రామ్ వ‌స్తుందంటే ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామని ట్రై చేసింది. అంతే.. ఆమె మాట్లాడే తీరు న‌చ్చ‌డంతో వెంటనే శ్రుతిని సెలెక్ట్ చేసేసారు. ఆ విధంగా తీన్మార్ వార్త‌లు షో ద్వారా సుజాత‌గా అంద‌రికీ పరిచయమైంది శ్రుతి. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన శ్రుతి వ‌చ్చీరాగానే నాగార్జున‌ను బిట్టు అని ప‌ల‌క‌రిస్తూ జోర్దార్‌గా మాట్లాడి.. త‌న వాక్చాతుర్యం‌తో మన టాలీవుడ్ మన్మధుడిని బుట్ట‌లో వేసుకుంది. ఈ సందర్భంగా నాగ్ శ్రుతికి బ‌హుమ‌తి కూడా ఇచ్చారు.

లాస్య

స్టార్ మా మ్యూజిక్‌లో “సమ్‌థింగ్ స్పెషల్” ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన లాస్య.. బిగ్‌బాస్‌ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. చీమ-ఏనుగు జోకులకు లాస్య ఎంతో ఫేమస్. ఇక రవి-లాస్య జంట బుల్లితెరపై ఎంతగా సందడి చేసిందో అందరికీ తెలిసిందే.

దేవి నాగవల్లి

టీవీ 9 నుంచి సీనియర్ న్యూస్ ప్రజెంటర్‌గా ఉన్న దేవి నాగవల్లి బిగ్ బాస్‌లో బ్రేకింగ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైపోయింది. రిపోర్టింగ్‌లో డేరింగ్ నెస్ చూపిస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా బ్రేకింగ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉండే దేవి రొటీన్‌కి భిన్నమనే చెప్పాలి. రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజంపై ఆసక్తితో.. మాస్ కమ్యునికేషన్‌లో డిప్లమో చేసి బ్రేకింగ్ న్యూస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న టీవీ 9తో కెరియర్ మొదలు పెట్టింది. ప్రజెంటేషన్‌లో తనడైన మార్క్ ను చూపించి అతి తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ ప్రజెంటర్‌గా మంచి గుర్తింపును సంపాదించింది దేవి నాగవల్లి. వీకెండ్ లైవ్ డిస్కషన్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న దేవి.. చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేసి క్రేజ్ సంపాదించారు. స్టుడియోలో కూర్చుని వార్తలు చదవడమే కాకుండా.. ఆన్-గ్రౌండ్ రిపోర్టింగ్‌లో గణనీయమైన అనుభవం సంపాదించింది దేవి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago