నాన్నమ్మ మీద కోపంతో ఆమె పై లారీ ఎక్కించిన మనవడు.. చివరికి ఇలా?

సాధారణంగా క్షణికావేశంలో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితులలోకి వెళ్లి పోతాము. ఇలా క్షణికావేశంలో ఓ యువకుడు తన నాన్నమ్మ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫర్‌పూర్‌లోని రక్ష గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇన్ని రోజులు పని నిమిత్తం బయటకు వెళ్లిన దిలీప్ దసరా పండుగ రోజు ఇంటికి వచ్చాడు.

అయితే తను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో పలు మనస్పర్ధలు గొడవలు వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. దీంతో ఈ గొడవలు అన్నింటికీ కారణం తన నాన్నమ్మ అని గ్రహించిన దిలీప్ తన పై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన నానమ్మ ఉదయం ఇంటిముందు ముగ్గు వేస్తున్న సమయంలో దిలీప్ ఆవేశంతో తన లారీని తన నానమ్మ పై ఎక్కించాడు.

ఇలా ఈ ప్రమాదంలో తన నానమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలోనే తన తల్లి మరణించడంతో
దిలీప్ తండ్రి రాజేశ్వర్ రాయ్ తన కొడుకు దిలీప్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా తన ప్రమాదానికి ఉపయోగించిన లారీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.