మనలో చాలామంది మాంసాహారం ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. చికెన్, మటన్ లేనిదే తిండి తినని వాళ్లు చాలామంది ఉంటారు. అయితే చికెన్ ధరలు గత కొన్ని రోజుల నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వల్ల వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. కోళ్లు కూడా బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశాలు ఉంటుంది. బర్డ్ ఫ్లూ బారిన పడిన కోళ్లను తింటే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో సైతం బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు మృత్యువాత పడటంతో గుడ్డు, చికెన్ ధరలు తగ్గుతున్నాయి. గతేడాది కరోనా విజృంభించిన సమయంలో చాలామంది ప్రజలు భయాందోళనకు గురై చికెన్, గుడ్లు తినడానికి ఆసక్తి చూపలేదు. ఆ తరువాత శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, రాజకీయ, సినీ ప్రముఖులు చికెన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయే తప్ప ఎటువంటి సమస్యలు రావని స్పష్టతనివ్వడంతో ప్రజలు చికెన్, గుడ్లు తినడానికి ఆసక్తి చూపారు.
అయితే బర్డ్ ఫ్లూ భయం వల్ల చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీలో కిలో చికెన్ 15 రూపాయలకు పడిపోవడం గమనార్హం. ధరలు భారీగా తగ్గడంతో కోళ్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుస్తోంది. చికెన్ ను కొనుగోలు చేసినా బాగా ఉడికించి తింటే బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గుడ్లు, చికెన్ ధరలు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.
అయితే చికెన్ ప్రియులు మాత్రం తక్కువ ధరకే చికెన్ కొనుగోలు చేసే అవకశం ఉండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చికెన్ దుకాణాదారులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో తమకు గిట్టుబాటు కాకపోయినా చికెన్ ను విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. దేశంలో బర్డ్ ఫ్లూ అదుపులోకి వస్తే మాత్రమే గుడ్లు, చికెన్ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…