ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ఎంతో అవసరం. మన రోజు వారి అవసరాలు తీరాలన్న, ఏదైనా చిన్న పని నుంచి పెద్ద పని నెరవేరాలని డబ్బు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ఆ డబ్బు లేనిదే ఎటువంటి చిన్న పని కూడా సక్రమంగా నెరవేరదు అనే విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా డబ్బుతో సాధ్యం కానిదంటూ ఈ ప్రపంచంలో మరేదీ లేదు. అదృష్టం కలిసి వస్తే కొంతమందికి డబ్బులు ఎటువంటి పనులు చేయకున్నా వారికి లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. మరి కొంతమంది రాత్రి పగలు కష్టపడుతున్న చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అలాంటి వారు చేతిలో డబ్బు నిలవాలంటే ఈ క్రింది నియమాలను పాటిస్తే వారి చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటాయి…
సాధారణంగా లక్ష్మీ దేవి సంపదకు మూలమని చెబుతుంటారు. అలాంటి సంపద మనకు కలగాలంటే లక్ష్మీ దేవిని పూజించాలని పండితులు తెలియజేస్తున్నారు.అయితే లక్ష్మీదేవిని బియ్యంతో పూజించిన తర్వాత పూజించిన బియ్యాన్ని మన దగ్గర ఉంచుకోవడం వల్ల మనకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే సంపాదించిన డబ్బు కూడా మన దగ్గర నిల్వ ఉంటుంది.
లక్ష్మీదేవి ఫోటోను విష్ణు పాదాల చెంత పెట్టడం వల్ల మన ఇంట్లో డబ్బు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు ఆకులు కోసి ఆకులను శుభ్రంగా కడిగి ఆకుపై T అనే అక్షరాన్ని రాసి మన దగ్గర ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడవు. గవ్వలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.అటువంటి గవ్వలకు పూజ చేసి ఒక తెల్లటి వస్త్రంలో కట్టి మన ఇంటిలో డబ్బు నిల్వ ఉంటే చోట పెట్టడం ద్వారా మన ఇంట్లోకి లక్ష్మీ ప్రవాహం మొదలవుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
అదేవిధంగా తెల్లని కోడిగుడ్డు ఆకారంలో ఉన్న రాయిని నిత్యం మన వెంట పెట్టుకోవడం ద్వారా మనలో ఏర్పడే ప్రతికూల ఆలోచనలను తొలగించి అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా కొన్ని నియమాలను పాటించటం వల్ల మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి మన చేతిలో కొంత వరకు డబ్బు నిల్వ ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…