Featured

బంగారం కొనేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ డాక్యుమెంట్లు ఉంటేనే కొనుగోలు చేసే ఛాన్స్..?

ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోని ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. సాధారణ రోజులతో పోల్చి చూస్తే పండుగ సమయాల్లో, పెళ్లి సమయాల్లో ఎక్కువగా బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. సాధారణంగా డబ్బులు చెల్లించి ఎవరైనా బంగారం కొనుగోలు చేయవచ్చు. అయితే కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని.. ఇకపై కేవైసీ డాక్యుమెంట్లు ఉంటే మాత్రమే బంగారం కొనుగోలు చేసేలా నిబంధనలు రానున్నాయని తెలుస్తోంది.

ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం ఇకపై బంగారం కొనుగోలు చేయాలని వెళ్లేవాళ్లు తమతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నగదు రూపంలో బంగారం కొనుగోలు చేసేవాళ్లు తప్పనిసరిగా కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఇప్పటికే జువెలరీ రంగానికి మనీ లాండరింగ్ చట్టాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఇకపై బంగారానికి సైతం కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలని నియమనిబంధనలను అమలులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యువెలరీ సంస్థలు అనుమానాస్పద లావాదేవీలు జరిపితే ప్రభుత్వ కంపెనీలు వివరణ కోరే అవకాశాలు ఉంటాయి. అందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఇప్పటికే పలు జ్యువెలరీ సంస్థలు కేవైసీ డాక్యుమెంట్లను కోరుతున్నాయని తెలుస్తోంది.

2 లక్షల రూపాయల లోపు బంగారం కొనుగోలు చేసినా బంగారం కొనుగోలు చేసిన వాళ్లు కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. కేంద్రం నిబంధనల వల్ల కొనుగోలుదారులు సైతం కేవైసీ డాక్యుమెంట్ల విషయంలో గందరగోళానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల సమయంలో బంగారం కొనుగోళ్లకు కేవైసీ డాక్యుమెంట్లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago