General News

కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం కొత్త వేతన చట్టాన్ని అమలులోకి తీసుకురాగా ఈ వేతన చట్టానికి ప్రైవేట్ కంపెనీలు సైతం ఆమోదం ప్రకటించాయి. ఫలితంగా ఇకపై బేసిక్ పే కంటే అలవెన్సులు ఎక్కువగా ఉంటే ఉద్యోగులకు వేతనంలో కోత విధిస్తారు. ఏప్రిల్ నుంచి కొత్త వేతన చట్టం అమలులోకి రానుండగా అలవెన్సులు ఎక్కువగా ఉండే ఉద్యోగులు కొత్త వేతన చట్టం వల్ల తీవ్రంగా నష్టపోనున్నారు.

అలవెన్సులు ఎక్కువగా ఉండే ఉద్యోగులకు దాదాపు 12 శాతం వరకు వేతనంలో కోత విధించే అవకాశాలు ఉంటాయి. కొత్త వేతన చట్టం ప్రకారం వేతనంలో 50 శాతం బేసిక్ పే ఖచ్చితంగా ఉండాలి. అదే సమయంలో ఇతర ఆలవెన్సులు మాత్రం ఖచ్చితంగా 50 శాతం కంటే తక్కువగానే ఉండాలి. కొత్త వేతన చట్టానికి అంగీకారం తెలిపిన కంపెనీలు వేతనంలో 50 శాతం బేసిక్ పే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

కేంద్రం కొత్త వేతన చట్టం అమలులోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులకు గతంతో పోలిస్తే గ్రాట్యుటీ భారీగా పెరగనుంది. అదే సమయంలో ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తంతో పోలిస్తే పీఎఫ్ కోసం ఉద్యోగం చెల్లించే మొత్తం కూడా పెరగనుంది. మారిన నియమనిబంధనల వల్ల ఉద్యోగులకు ప్రస్తుతం ఇంటికి తీసుకెళ్లే మొత్తంతో పోలిస్తే వేతనం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఉద్యోగి ఇప్పుడు నష్టపోయినా పదవీ విరమణ తర్వాత ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది.

ఈ చట్టం వల్ల జీతాల చెల్లింపు విషయంలో కీలక మార్పులు రానుండగా ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే ప్రైవేట్ రంగ ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం తీవ్రంగా పడనుంది. ఆర్థిక నిపుణులు కొత్త వేతన చట్టం వల్ల ఉద్యోగులు తాత్కాలికంగా నష్టపోయినా భవిష్యత్తులో భారీ లాభాలు పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago