ప్రస్తుత కాలంలో యువతీ, యువకులు వారి చదువులు, ఉద్యోగాలు అనే వేటలో పడి సరైన సమయంలో వివాహాలు చేసుకోవడం లేదు. జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లిళ్లు చేసుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఎంతో సుఖంగా ఉంటారని భావిస్తారు. ఈ ఆలోచనా ధోరణి వల్ల ఎంతోమంది ప్రస్తుతం పిల్లలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుత కాలంలో యువతీయువకుల జీవనశైలిలో పెద్దగా మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని జంటలు పెళ్లయిన తర్వాత వారికి పిల్లలు కలగాలనే ఉద్దేశంతో ఎటువంటి పిల్స్ వాడకుండా గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి పిల్లలు కలగడం లేదు. ఇలాంటి సమయంలోనే వారికి పిల్లలు కలగకపోవడానికి గల కారణం కేవలం మహిళల అని మాత్రమే భావిస్తుంటారు. ప్రస్తుత కాలంలో పిల్లలు కలగకపోవడానికి కారణం యువకుల పాత్ర కూడా చాలా ఉంది.
యువకులు లేటుగా పెళ్లి చేసుకోవడమే కాకుండా వారి జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వారిలో స్పెర్ కౌంట్ చాలా తక్కువగా ఉండటం వల్ల పిల్లలు కలగకపోవడానికి కారణం అవుతోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఒకరు ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఒక సారి ఎజాక్యులేషన్ జరిగినప్పుడు 40 మిలియన్ స్పర్మ్స్ మగవాళ్ళ నుంచి రిలీజ్ అవుతాయి. యువకులు మరియు 30 కి దగ్గరలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు తక్కువ స్పెర్మ్ కౌంట్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికి కారణం వారి జీవన విధానం సరిగ్గా లేకపోవడం అని నిపుణులు తెలియజేస్తున్నారు.
సాధారణంగా యువకులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి గల కారణం పుట్టుకతోనే ఏవైనా సమస్యలు తలెత్తడం లేదా జన్యుపరమైన కారణాలు,టెస్టిక్యూలర్ ఇంజురీ, అలానే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం, డ్రగ్స్ అతిగా తీసుకోవడం, తక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా వీరిలో స్పెర్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. వయసు 30 సంవత్సరాలు దాటినా కూడా మనం ఎలాంటి గర్భనిరోధక మాత్రలు ఉపయోగించకుండా ఉంటూ గర్భం కోసం ప్రయత్నిస్తున్న పిల్లలు కలగకపోతే ఒకసారి వైద్యుని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలి.
ఈ విధంగా భార్యభర్తలిద్దరు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇన్ఫెర్టిలిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారికి ప్రత్యేక పద్ధతుల ద్వారా చికిత్స విధానాన్ని మొదలుపెడతారు. వివిధ రకాల చికిత్సా పద్ధతుల ద్వారా సంతానం కలిగేలా చేస్తారు. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఆందోళన, ధూమపానం, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉంటూ.. సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…