ప్రస్తుత కాలంలో యువతీ, యువకులు వారి చదువులు, ఉద్యోగాలు అనే వేటలో పడి సరైన సమయంలో వివాహాలు చేసుకోవడం లేదు. జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లిళ్లు చేసుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఎంతో సుఖంగా ఉంటారని భావిస్తారు. ఈ ఆలోచనా ధోరణి వల్ల ఎంతోమంది ప్రస్తుతం పిల్లలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

ప్రస్తుత కాలంలో యువతీయువకుల జీవనశైలిలో పెద్దగా మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని జంటలు పెళ్లయిన తర్వాత వారికి పిల్లలు కలగాలనే ఉద్దేశంతో ఎటువంటి పిల్స్ వాడకుండా గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి పిల్లలు కలగడం లేదు. ఇలాంటి సమయంలోనే వారికి పిల్లలు కలగకపోవడానికి గల కారణం కేవలం మహిళల అని మాత్రమే భావిస్తుంటారు. ప్రస్తుత కాలంలో పిల్లలు కలగకపోవడానికి కారణం యువకుల పాత్ర కూడా చాలా ఉంది.

యువకులు లేటుగా పెళ్లి చేసుకోవడమే కాకుండా వారి జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వారిలో స్పెర్ కౌంట్ చాలా తక్కువగా ఉండటం వల్ల పిల్లలు కలగకపోవడానికి కారణం అవుతోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఒకరు ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఒక సారి ఎజాక్యులేషన్ జరిగినప్పుడు 40 మిలియన్ స్పర్మ్స్ మగవాళ్ళ నుంచి రిలీజ్ అవుతాయి. యువకులు మరియు 30 కి దగ్గరలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు తక్కువ స్పెర్మ్ కౌంట్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికి కారణం వారి జీవన విధానం సరిగ్గా లేకపోవడం అని నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా యువకులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి గల కారణం పుట్టుకతోనే ఏవైనా సమస్యలు తలెత్తడం లేదా జన్యుపరమైన కారణాలు,టెస్టిక్యూలర్ ఇంజురీ, అలానే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం, డ్రగ్స్ అతిగా తీసుకోవడం, తక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా వీరిలో స్పెర్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. వయసు 30 సంవత్సరాలు దాటినా కూడా మనం ఎలాంటి గర్భనిరోధక మాత్రలు ఉపయోగించకుండా ఉంటూ గర్భం కోసం ప్రయత్నిస్తున్న పిల్లలు కలగకపోతే ఒకసారి వైద్యుని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలి.

ఈ విధంగా భార్యభర్తలిద్దరు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇన్ఫెర్టిలిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారికి ప్రత్యేక పద్ధతుల ద్వారా చికిత్స విధానాన్ని మొదలుపెడతారు. వివిధ రకాల చికిత్సా పద్ధతుల ద్వారా సంతానం కలిగేలా చేస్తారు. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఆందోళన, ధూమపానం, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉంటూ.. సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here