మనదేశంలో ఎలుగుబంట్లు అటవీ ప్రాంతాలలో ఉంటూ అప్పుడప్పుడు రోడ్లపైకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. కానీ విదేశాల్లో మాత్రం ఈ ఎలుగుబంట్లు రోడ్డుపైకి వచ్చి తరుచూ వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంటాయి. ప్రస్తుతం పార్కింగ్ చేసిన కారులోకి ఎలుగుబంటి దూరి కారును మొత్తం సర్వనాశనం చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని హోస్టన్ కౌంటీ. ఓ ఆర్ట్ టీచర్‌కి… తన జీవితంలో ఎప్పుడూ తగలని షాక్ తగిలింది రోజూలాగే స్కూల్ కు వచ్చి ఆమె కారును పార్క్ చేసి వెళ్ళింది. స్కూల్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో దూరం నుంచి ఆమె తన కారులో ఏదో ఉన్నట్టు గమనించింది. తీరా దగ్గరకొచ్చి చూడగానే ఆమెకు కారులో ఎలుగు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళన చెందింది.
కారులు ఎలుగుబంటిని చూసిన టీచర్ అక్కడినుంచి ఆమడ దూరం పరుగులు పెట్టి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారు దగ్గరకు వెళ్లారు. కారు డోర్స్ లాక్ చేసినప్పటికీ వాటిని తీసుకుని లోపలికి వెళ్ళిన ఎలుగుబంటి దర్జాగా కారులో కూర్చోవడం పోలీసులు గమనించారు.
కారులో ఎలుగుబంటి ఉండడం చూసిన పోలీసులు గట్టిగా అరవడంతో భయపడిన ఎలుగుబంటి కారులో నుంచి దూకి అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టింది. ఆ తర్వాత కారును చూస్తే కారులో ఉన్న ఇంటీరియర్ మొత్తం సర్వనాశనం చేసి పెద్ద బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం కారులో నుంచి ఆ ఎలుగుబంటి బయటకు పారిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…