మనదేశంలో ఎలుగుబంట్లు అటవీ ప్రాంతాలలో ఉంటూ అప్పుడప్పుడు రోడ్లపైకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. కానీ విదేశాల్లో మాత్రం ఈ ఎలుగుబంట్లు రోడ్డుపైకి వచ్చి తరుచూ వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంటాయి. ప్రస్తుతం పార్కింగ్ చేసిన కారులోకి ఎలుగుబంటి దూరి కారును మొత్తం సర్వనాశనం చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని హోస్టన్ కౌంటీ. ఓ ఆర్ట్ టీచర్‌కి… తన జీవితంలో ఎప్పుడూ తగలని షాక్ తగిలింది రోజూలాగే స్కూల్ కు వచ్చి ఆమె కారును పార్క్ చేసి వెళ్ళింది. స్కూల్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో దూరం నుంచి ఆమె తన కారులో ఏదో ఉన్నట్టు గమనించింది. తీరా దగ్గరకొచ్చి చూడగానే ఆమెకు కారులో ఎలుగు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళన చెందింది.

కారులు ఎలుగుబంటిని చూసిన టీచర్ అక్కడినుంచి ఆమడ దూరం పరుగులు పెట్టి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారు దగ్గరకు వెళ్లారు. కారు డోర్స్ లాక్ చేసినప్పటికీ వాటిని తీసుకుని లోపలికి వెళ్ళిన ఎలుగుబంటి దర్జాగా కారులో కూర్చోవడం పోలీసులు గమనించారు.

https://youtu.be/4WL1ITBU86I

కారులో ఎలుగుబంటి ఉండడం చూసిన పోలీసులు గట్టిగా అరవడంతో భయపడిన ఎలుగుబంటి కారులో నుంచి దూకి అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టింది. ఆ తర్వాత కారును చూస్తే కారులో ఉన్న ఇంటీరియర్ మొత్తం సర్వనాశనం చేసి పెద్ద బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం కారులో నుంచి ఆ ఎలుగుబంటి బయటకు పారిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here