Featured

Mahesh Babu: బాలీవుడ్ భరించలేదు కానీ.. పాన్ మసాలా భరిస్తుందంటూ మహేష్ ను ట్రోల్ చేస్తున్న నార్త్ ఇండియన్స్!

Mahesh Babu: దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్2 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు దక్షిణాది సినీ ఇండస్ట్రీపై కాస్త గుర్రుగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ భాష హిందీ కాదంటూ మరో వివాదం తెరపైకి రావడంతో ఈ విషయంపై ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Mahesh Babu: బాలీవుడ్ తనని భరించలేదు కానీ.. పాన్ మసాలా కంపెనీ భరిస్తుందంటూ మహేష్ ను ట్రోల్ చేస్తున్న నార్త్ ఇండియన్స్!

ఇక ఈ వివాదం ముగిసిందనే లోపు సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం లో భాగంగా తనకు బాలీవుడ్ వెళ్లడం ఇష్టం లేదని బాలీవుడ్ తనని భరించలేదు అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.అయితే తను ఏ ఉద్దేశంతో అన్నారో క్లారిటీ ఇచ్చినప్పటికీ కొందరు నార్త్ ఇండియన్స్ మాత్రం ఇదే అదునుగా భావించి దారుణంగా మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు.

Mahesh Babu: బాలీవుడ్ తనని భరించలేదు కానీ.. పాన్ మసాలా కంపెనీ భరిస్తుందంటూ మహేష్ ను ట్రోల్ చేస్తున్న నార్త్ ఇండియన్స్!

ఈ క్రమంలోనే మహేష్ బాబు టైగర్ ష్రాఫ్‌తో కలిసి పాన్‌ బహర్‌ యాడ్‌ చేశాడు. దీనిని అదునుగా చేసుకొని నార్త్ ఇండియన్స్ మహేష్ బాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ మహేష్ బాబుని బాలీవుడ్ భరించలేదు కానీ ఆయనని ఒక పాన్ మసాలా కంపెనీ భరిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అవును అది నిజమే ఆయనను పాన్ మసాలా కంపెనీ మాత్రమే భరించగలదు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఎవరు నోరు మెదపడం లేదు…

ఇలాంటి పాన్ మసాలా యాడ్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ నటించగా ఈ హీరోలను తప్పుబడుతూ విమర్శించారు. ఇప్పుడు అలాంటి పాన్ మసాలా యాడ్ లో మహేష్ బాబు నటిస్తే ఆయన గురించి ఎవరు నోరు విప్పడం లేదు అంటూ నార్త్ ఇండియన్ మహేష్ బాబు పై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago