Mahesh Babu: దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్2 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు దక్షిణాది సినీ ఇండస్ట్రీపై కాస్త గుర్రుగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ భాష హిందీ కాదంటూ మరో వివాదం తెరపైకి రావడంతో ఈ విషయంపై ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ వివాదం ముగిసిందనే లోపు సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం లో భాగంగా తనకు బాలీవుడ్ వెళ్లడం ఇష్టం లేదని బాలీవుడ్ తనని భరించలేదు అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.అయితే తను ఏ ఉద్దేశంతో అన్నారో క్లారిటీ ఇచ్చినప్పటికీ కొందరు నార్త్ ఇండియన్స్ మాత్రం ఇదే అదునుగా భావించి దారుణంగా మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు టైగర్ ష్రాఫ్‌తో కలిసి పాన్ బహర్ యాడ్ చేశాడు. దీనిని అదునుగా చేసుకొని నార్త్ ఇండియన్స్ మహేష్ బాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ మహేష్ బాబుని బాలీవుడ్ భరించలేదు కానీ ఆయనని ఒక పాన్ మసాలా కంపెనీ భరిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అవును అది నిజమే ఆయనను పాన్ మసాలా కంపెనీ మాత్రమే భరించగలదు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
I assume only TFI stars like #MaheshBabu are allowed to sell Pan Masala products, while the rest are abused for doing the same. Nice double standards???? @Its_CineHub
— J.P.S (@TheJ_P_S) May 12, 2022
#SarkaruVaariPaata #SVP #PrithvirajChauhan pic.twitter.com/ymuv2Vw1oi
ఎవరు నోరు మెదపడం లేదు…
ఇలాంటి పాన్ మసాలా యాడ్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ నటించగా ఈ హీరోలను తప్పుబడుతూ విమర్శించారు. ఇప్పుడు అలాంటి పాన్ మసాలా యాడ్ లో మహేష్ బాబు నటిస్తే ఆయన గురించి ఎవరు నోరు విప్పడం లేదు అంటూ నార్త్ ఇండియన్ మహేష్ బాబు పై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
Just saw many trolling and abusing Bollywood starts on their endorsement of Vimal Pan Masala but if I am not mistaken many of the starts in South India too have endorsed such Pan Masalas just that they never faced such criticism.
— Aman Gupta (@imamangupta07) May 11, 2022
Mahesh Babu is no difference.
Tiger Shroff too. pic.twitter.com/vS1sDZ0xzB































