Featured

Shivani: నా వల్లే నాన్న ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.. నేను నష్ట జాతకురాలిని..! శివాని ఎమోషనల్ కామెంట్స్ !

Shivani: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శేఖర్. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ కుటుంబం సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

Shivani: నా వల్లే నాన్న ఆ స్థితిలో ఉన్నారు.. నేను నష్ట జాతకురాలిని.. ఫ్రీ రిలీజ్ వేడుక లో ఎమోషనల్ అయిన శివాని!

జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ముస్కాన్, ఆత్మీయ రాజన్‌ హీరోయిన్లుగా శివాని ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజశేఖర్ కూతురు శివాని మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి.దీంతో తాను కరోనా బారిన పడ్డానని తనకు కరోనా రావడం వల్ల తన నుంచి తన తండ్రి కూడా కరోనా బారిన పడ్డారని శివాని తెలిపారు.

Shivani: నా వల్లే నాన్న ఆ స్థితిలో ఉన్నారు.. నేను నష్ట జాతకురాలిని.. ఫ్రీ రిలీజ్ వేడుక లో ఎమోషనల్ అయిన శివాని!

కరోనా నుంచి నేను తొందరగా కోలుకున్నప్పటికీ నాన్న మాత్రం చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో డాక్టర్లు 50-50 ఛాన్స్ అని కూడా చెప్పారు. ఆ సమయంలో నాన్నను అలా చూసేసరికి నాన్న ఇలా కావడానికి ప్రధాన కారణం నేనే కదా అని నాపై నాకు చాలా కోపం వచ్చిందని శివాని తెలిపారు. ఆ సమయంలో బయట వాళ్ళు అందరూ నన్ను నష్ట జాతకురాలని పిలిచారు. నాకు అదే అనిపించింది.

వద్దని చెప్పిన సిగరెట్ తాగారు…

నాన్నను ఆ పరిస్థితులలో చూసి తట్టుకోలేకపోయానని భగవంతుడి దయవల్ల నాన్న ఆరోగ్యంగా బయటపడ్డారని శివాని ఈ సందర్భంగా తన నాన్న ఆరోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. వేదికపై శివాని మాట్లాడుతూ వుండగా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాన్న ఎంతో యాక్టివ్ గా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో తన పాత్ర సిగరెట్ తాగితేనే అద్భుతంగా ఉంటుంది. కానీ అప్పటికే కరోనా సోకిన నాన్న లంగ్స్ దెబ్బతిన్నాయి. అందుకే సిగరెట్ వద్దని చెప్పినా వినకుండా ఈ పాత్ర హైలెట్ కావాలంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సిగరెట్ తాగారని,ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రాజశేఖర్ పడిన కష్టం గురించి శివాని వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago