Categories: FeaturedGeneral News

బాలీవుడ్ ప్రముఖులను వణికిస్తున్న డ్రగ్స్ కేసు.. 50 మందిలో టెన్షన్..?

సుశాంత్ మృతి కేసు ఆత్మహత్యో హత్యో తేలుతుందని ఆయన అభిమానులు భావిస్తే ఆయన ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో రియా తనను తాను అమాయకురాలని పేర్కొంది. తనకే పాపం తెలియదని తప్పంతా సుశాంత్ చేశాడని చెబుతోంది.

తనతో పరిచయం ఏర్పడక ముందే సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉండేదని.. తన డబ్బులతో కొన్నిసార్లు మాత్రమే సుశాంత్ కు డ్రగ్స్ కొనిచ్చామని.. సుశాంత్ తన స్టాఫ్ ను సైతం డ్రగ్స్ కావాలని బలవంతం చేశాడని చెప్పారు. సుశాంత్ వల్ల మానసిక క్షోభ అనుభవిస్తున్నామని.. తనతో పాటు తన సోదరుడిని కూడా డ్రగ్స్ కోసం వినియోగించుకున్నారని రియా చక్రవర్తి పేర్కొన్నారు.
 
రియా బాలీవుడ్ లోని దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకునే వారని వెల్లడించారు. అయితే ఎన్సీబీ అధికారులు మొదట కొందరి పేర్లను మాత్రమే లీక్ చేశారని ఈ జాబితాలో దాదాపు 50 మంది ఉన్నారని తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ తీసుకున్న బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర ఇండస్ట్రీల సినీ ప్రముఖుల్లో సైతం టెన్షన్ నెలకొంది.
 
రియా ఫోన్ ఛాటింగ్, ఇతర ఆధారాలను బట్టి మరి కొంతమందికి నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలూవురు స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు డ్రగ్స్ తీసుకున్నట్టు వార్తలు వచ్చినా ఆ కేసు ఏమైందో తెలీదు. బాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా టాలీవుడ్ కేసులా మారుతుందా…? లేదా…? తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago