యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి కంటె ముందు వచ్చిన ఫేమ్ కంటే.. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఇంటర్నేషనల్ ఫిగర్ అన్నమాట. అయితే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా.. సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ఆదిపురుష్.
ప్రస్తుతం ఈ సినిమా ముంబాయిలో జరుగుతోంది. షూటింగ్ లో ప్రభాస్ ఎంత జాలీగా ఉంటారో అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా షూటింగ్ బ్రేక్ లో కూడా ఆ చిత్ర బృందం వివిధ రాకల వంటకాలు చేసి.. ఓ వీడియోను రూపొందించారు. అప్పుడు అది వైరల్ గా మారింది. అయితే ఇక్కడ ప్రభాస్
సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కోసం ప్రభాస్ ప్రత్యేకంగా వివిధ వంటకాలు తయారు చేయించి పంపించారు.
ప్రభాస్ పంపిన వంటకాల్లో స్పెషల్ బిర్యానీ, ఖీర్, నాన్ వెజ్ కర్రీ ఉన్నాయట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తమ పట్ల చూపిన అభిమానానికి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు సైఫ్ కుటుంబసభ్యులు. ఇదిలా ఉండగా.. సైఫ్ భార్య కరీనా కపూర్ వంటకాలకు సంబంధించి ఫొటోలను తీసి తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
బాహుబలి బిర్యానీ పంపిస్తే అది కచ్చితంగా ది బెస్ట్ అవుతుంది… థాంక్యూ ప్రభాస్ అంటూ కరీనా కృతజ్ఞతలు తెలిపారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కు మొదట 1991 లో అమృతా సింగ్ తో వివాహం కాగా.. తర్వాత వీరిద్దరు 2004 లో విడాకులు తీసుకున్నారు.. 2012లో కరీనా కపూర్ ను సైఫ్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…