Kangana Ranaut: కంగనా రౌనత్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఎమర్జెన్సీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె హీరోయిన్గా కొనసాగుతూనే పలు వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు.
ఈ క్రమంలోనే కంగనా తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె తనని సింగర్ లతా మంగేష్కర్ తో పోల్చుకున్నారు. లతా మంగేష్కర్ ఏదైనా ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొనాలి అంటే పాడటానికి ఇష్టపడరట. ఇలా డబ్బులు తీసుకుని తనకు పాటలు పాడటం ఏమాత్రం ఇష్టం ఉండదని ఈమె పెళ్లిళ్లకు అసలు వెళ్లేవారు కాదు.
ఈ క్రమంలోనే కంగనా తనకు కూడా డబ్బు తీసుకొని పెళ్లిలలో డాన్సులు వేయడం ఏమాత్రం నచ్చదని తెలిపారు. నాకు డబ్బు కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని, డబ్బు కోసం తాను అలాంటి పనులు చేయనని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈమె బాలీవుడ్ సెలబ్రిటీలను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
డబ్బు తీసుకొని డాన్సులు చెయ్యను…
ఇటీవల ముకేశ్ అంబానీ కుమారుడి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున డాన్సులు చేశారు. ఇలా డబ్బు తీసుకొని వీరంతా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…