Kajal Agarwal: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె ఒకానొక సమయంలో తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు. అయితే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చినటువంటి కాజల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక హీరోయిన్స్ అన్న తర్వాత పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా కాజల్, హైదరాబాద్లోని ఒక ఫ్యాషన్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక కాజల్ వస్తున్నారు అనే విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఓ అభిమాని సెల్ఫీ కోసం కాజల్ వద్దకు వెళ్లారు..
కాజల్ తో కలిసి సెల్ఫీ తీసుకున్నటువంటి ఆ అభిమాని ఏకంగా తన నడుము పై చేయి వేయడానికి ప్రయత్నం చేశారు దీనితో ఒక్కసారిగా కాజల్ సీరియస్ కావడంతో వెంటనే తన బౌన్సర్లు ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోయారు. ఇలా అందరి ముందు తన నడుం పై చేయి వేయడంతో కాజల్ సీరియస్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతుంది.
కాజల్ కి చేదు అనుభవం…
ఇలా హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కనుక పెద్దగా హీరోయిన్లు బయటకు రావడానికి ఇష్టపడరు. ప్రస్తుతం సత్యభామ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…