Prashanth Neel: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన మొదట ఉగ్రం అనే సినిమాకు దర్శకుడుగా పనిచేశారు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయినటువంటి ప్రశాంత్ అనంతరం కే జి ఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అయింది.
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ పనులను కూడా జరుపుకోవాలని ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు.
ఇక ఈయన మొదట దర్శకత్వం వహించిన ఉగ్రం సినిమా విడుదలై 10 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో ఈయన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఒక విషయాన్ని తెలియజేశారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే నన్ను ఫాలో అయ్యి ఇండస్ట్రీలోకి రావద్దని తెలిపారు. నేను డైరెక్టర్గా ఉగ్రం సినిమాకు పని చేయడానికంటే ముందు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయలేదు ఒక షార్ట్ ఫిలిం కూడా తీయలేదని తెలిపారు.
నాలుగు సంవత్సరాలు..
ఇలా ఎక్కడ పని చేయకుండా డైరెక్టర్గా రావడంతో తాను ఆరు నెలలలో చేయాల్సిన సినిమాని నాలుగు సంవత్సరాలు చేశానని దీంతో నిర్మాతలతో పాటు నేను కూడా అధిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. అందుకే ఎవరు కూడా ఈ విషయంలో తనని ఫాలో అయ్యి తప్పు చేయొద్దని ప్రశాంత్ నీల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…