హైదరాబాదులో బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాంనగర్ లోని వైట్ హౌస్ హోటల్ సమీపంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. హోటల్ సమీపంలో ఉన్న ఒక చెత్తకుండీలో పేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. సమీపంలోని చెత్త కుండీ వద్ద చేత ఏరుకునే వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. జరిగిన ఘటనకు రాంనగర్ వాసులు ఉలిక్కి పడ్డారు. సదరు వ్యక్తి చెత్త ఏరుకునే సమయంలో అతని చేతిలో ఉన్న బాక్స్ ఒక్కసారిగా పేలడంతో పేలుడు సంభవించిందని ప్రాధమిక సమాచారం. అయితే పేలుడు ఘటన తెలుసుకున్న పోలీసులు హుటాహుటియన సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. డాగ్ స్క్వాడ్ ను తెప్పించి చుట్టుపక్కల ప్రాంతాలలో తనికీలు చేపట్టారు. గాయాల పాలైన వ్యక్తిని హుటా హుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ హాస్పిటల్ లో ఆ వ్యక్తికీ చికిత్స అందిస్తున్నారు. చెత్తకుండీలో పడేసిన డబ్బా పేలిందని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. అసలు ఆ డబ్బా ఎక్కడనుంచి వచ్చింది. అందులో ఏముంది అనేదానిపై విచారణ జారుతుంది.
అసలే దేశంలో ఎక్కడ ఎటువంటి విద్రోహ చర్య జరిగినా, తీవ్ర వాదులు చెలరేగినా వారికి మూలాలు ఏదో ఒక రూపంలో హైదరాబాద్ లో ఉండటం, హైదరాబాద్ నుండి వారికి ఏదో ఒకరకమైన సహకారం లభించడం గత కొంన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఒక వంక ఉగ్రవాదులకు, మరో వంక మావోయిస్టు లకు ఇక్కడ వారి పన్నాగాలు అనుగుణంగా భావిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…