Categories: FeaturedMovie News

Bombay Padma : ఆ నటుడు ఫుల్లుగా తాగి అర్ధరాత్రి ఇంటికి గులాబీపువ్వు పట్టుకొచ్చి నాకు జీవితాన్ని ఇస్తానన్నాడు.. తీరా అతను పెద్ద ఆర్టిస్ట్ అయ్యాక తన పక్కన చాన్స్ వస్తే నాతో చేయనని నన్ను తప్పించారు.. : బాంబే పద్మ

Bombay Padma : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 200 పైగా సినిమాల్లో చేసినా ఇంకా అంత గుర్తింపు లేకున్నా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న పాత్రయినా చేస్తూ అటు చాలా సీరియల్స్ చేస్తూ ఉన్న ఆర్టిస్ట్ బాంబే పద్మ గారు. సినిమాల్లోకి రావడానికి ప్రయత్నించినా మొదట్లు తల్లి చేతుల్లో బాగా దెబ్బలు తిని ఆ తరువాత పెళ్ళై పిల్లలు పుట్టాక ఒక సారి ప్రయత్నిద్ధాం అనుకుని సినిమాల్లోకి వచ్చిన ఆమె సినిమా పరిశ్రమలో ఎన్నో చేదు అనుభవాలను, అలాగే ప్రశంసలను అందుకున్నారు. భర్త బాధ్యత లేకుండా ఉంటే కుటుంబం బాధ్యతలను తీసుకుని అటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే ఇటు కెరీర్ కోసం కష్టపడ్డారు పద్మ. ఇక తన జీవితంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని కూడా పంచుకున్నారు.

అర్ధరాత్రి తాగి ఇంటి దగ్గరికి వచ్చాడు…

సినిమా ఇండస్ట్రీ లో పూరి జగన్నాథ్, తేజ, శేఖర్ ఖమ్ముల వంటి వారు సినిమా అవకాశాలను బాగా ఇచ్చారంటూ పద్మ గారు చెబుతూ మన పాత్ర సినిమాలో హిట్ అయిన దాన్ని బట్టే ఇండస్ట్రీ లో మన స్థాయి నిర్ణయించబడుతుంది అంటూ చెప్పారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ త్వరగా షార్ట్ కట్ లో ఎదగాలి అనుకున్నపుడు ఒక ఆడదే మగాడికి ఆఫర్ చేయడం చూసాను అలాగే అమ్మాయిలను అవకాశాల పేరుతో వాడుకున్న వాళ్ళను చూసాను, అడిగితే మన కర్మ ఒక్కసారి సర్షుకుపోతే మంచి ఆఫర్స్ వస్తాయి కదా అనుకుని వెళ్లిన వాళ్ళను చూసాను, ఇక ఇలాంటివి నాకొద్దు అనుకుని ఉండిపోయిన వారినీ చుసాను అంటూ క్యాస్టింగ్ కౌచ్ ను ఒక లైన్ లో వర్ణించలేము అంటూ చెప్పారు.

ఇక తాను ఎదుర్కొన్న ఒక సంఘటన కూడా చెప్పారు. ఒక ఆర్టిస్ట్ రాత్రికి తాగి వచ్చి గులాబీ పట్టుకుని నన్ను పెళ్లి చేసుకో నీకు జీవితాన్ని ఇస్తాను అంటూ వాగితే నా కొడుకు చాలా ఓపిగ్గా సమాధానం చెప్పి పంపాడు. ఆ తరువాత అతను పెద్ద ఆర్టిస్ట్ అయ్యాక ఒక సినిమాలో అతని భార్య వేషం వస్తే నా పక్కన చేయనని చెప్పాడు. దీంతో డైరెక్టర్ నా క్యారెక్టర్ ను మార్చాల్సి వచ్చింది. నేను నోరు విప్పకపోయినా అతను ఇప్పుడు అలాంటి తప్పుడు పనివల్ల చాలా ఫేమస్ అయ్యాడు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, అతని పేరును బయటపెట్టలేదు పద్మ గారు. ఇప్పటికి అవకాశాల కోసం ఆడిషన్స్ ఇస్తూనే ఉంటానని చెప్పారు కొన్నిసార్లు సరైన గౌరవం ఇవ్వరు అయినా ఇక్కడ ఇది మామూలే అని వదిలేస్తాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago