సాధారణంగా ఇద్దరు ప్రేమికులు విడిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు.కానీ ఈ ప్రేమికులు మాత్రం తన ప్రియురాలి పై ఉన్న ప్రేమతో ఏకంగా తన ప్రియురాలిని పెళ్లిలో కలవడం కోసం వధువు వేషములో కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే అతని నడక వాళకం చూసి అక్కడ వారికి అనుమానం రావడంతో అతని ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ బదోహీలో పెళ్లి చేసుకుంటున్న ప్రియురాలని కలిసేందుకు ఆ యువకుడికి ఈ ఐడియా వచ్చింది.తన ప్రియురాలిని కలవడం కోసం సాధారణంగా తయారు కాకుండా ఏకంగా వధువుల తయారయ్యి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ బయట కూర్చుని ఉన్నటువంటి అతిథులను వధువు గది ఎక్కడ అని అడగగా… ఇంతకీ నువ్వెవరు అంటూ వారు ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే బయట ఉన్న అతిథులు అతని వాలకం చూసి అనుమానం రావడంతో అతనిపై పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే వధువు వేషంలో ఉన్న అతను తన మొహం కనపడకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ వెనుకనుంచి ఎవరు లాగానే అతని విగ్గు ఓడిపోయి అసలు రంగు బయటపడింది. దీంతో అక్కడే ఉంటే బంధువులందరూ అతనిని చితకబాదతారని భావించి అక్కడ నుంచి పరుగులు తీశాడు.
ఈ క్రమంలోనే వధువును కలవడం కోసం ఆ విధంగా వధువు వేషంలో ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వచ్చాడు అనేదే ఇప్పుడు మిస్టరీ గా మారిపోయింది. ఒకవేళ వధువును చూసి వెళ్లడానికి వచ్చాడా? లేక ఆమెను కిడ్నాప్ చేయడానికి వచ్చాడా? అనేది తెలియడం లేదు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని భావించిన కుటుంబ సభ్యులు అంతటితో వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…