Breaking News

బ్రేకింగ్: ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా – కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2025: బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి సంచలన రాజీనామా చేశారు. గులాబీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో, ఆమె పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

కవిత సంచలన ఆరోపణలు చేస్తూ, కేటీఆర్‌కు హరీష్ రావు నుంచి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. “హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ బీఆర్ఎస్ మంచి కోరుకునేవారు కాదు. రేపు కేటీఆర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వొచ్చు,” అంటూ ఆమె బాంబు పేల్చారు. తన బాధను కేటీఆర్ ఎప్పుడూ అర్థం చేసుకోలేదని, “ఎప్పుడైనా నా గురించి ఆరా తీసావా?” అని కవిత నిలదీశారు.

ఈ రాజీనామా మరియు కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో లోతైన సంక్షోభాన్ని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago