గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. అయితేహీరో నాగ సౌర్య తండ్రికి సంబంధించిన ఫాంహౌస్ లో వీరందరూ అరెస్టు కావడంతో ఈ కేసుకు నాగసౌర్య తండ్రికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందా అంటూ పోలీసులు విచారణ జరిపారు.
ఈ విచారణలో భాగంగా క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌తో కలసి నాగసౌర్య తండ్రిశివలింగ ప్రసాద్ పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలను సేకరించడంతో వెంటనే పోలీసులు నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతనిని ఉప్పర్‌పల్లి కోర్టుకు హాజరు పరచడంతో తన తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
నిన్నటి వరకు ఈ పేకాట దందాతో నాగశౌర్య తండ్రికి ఏమాత్రం సంబంధం లేదని కేవలం ఫాంహౌస్ మాత్రమే అతని పేరు పై ఉందని ఈ వ్యవహారంలో నాగశౌర్య బాబాయి ఉన్నారంటూ వార్తలు వినిపించినప్పటికీ పోలీసులు పలు కీలకమైన ఆధారాలు సేకరించడంతో ఈ పేకాట దందాలో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ పేరు బయటపడింది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుమారు ముప్పై మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్ వాసులు మాత్రమే కాకుండా నిజామాబాద్, విజయవాడ నుంచి బడాబాబులు అక్కడికి చేరుకొని పేకాట ఆడుతున్నట్లు పోలీసులు వారి విచారణలో వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…