ఈ బీరు రూటే సపరేటు… బీరు తయారీలో మానవ మూత్రం?

సాధారణంగా బీరును మొక్క జొన్నలు, బార్లీ వంటి ధాన్యాలతో తయారు చేస్తుంటారు.ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓ బీరు తయారీ సంస్థ వినూత్నంగా రుచికరమైన, ఆరోగ్యకరమైన బీరు తయారు చేయడానికి మనిషి మూత్రాన్ని సేకరిస్తోందట. వినటానికి ఆశ్చర్యంగా ఉందా! ఇది నిజమే!
అయితే ఈ బీరుకు సంబంధించిన కథ ఏంటో
ఆ బీరును ఎలా తయారు చేస్తున్నారో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మనిషి మూత్రాన్ని బీరు తయారీకి ఉపయోగించే ఆ సంస్త పేరు పిస్నర్. డెన్మార్క్‌లో ఉన్న ఈ సంస్థ ఇటీవల ఉత్తర ఐరోపాలో నిర్వహించిన ఓ భారీ మ్యూజిక్ ఫెస్టివల్‌ల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాయిలెట్ల ద్వారా సుమారు 50 వేల లీటర్ల మనుషుల మూత్రాన్ని సేకరించిందట. మీరేం కంగారు పడకండి ఆ మూత్రాన్ని బీరు తయారీలో డైరెక్టుగా వాడరు.

ఇలా సేకరించిన మనిషి మూత్రాన్ని బీరు తయారీ సంస్థ బీరు తయారీకి ఉపయోగించే బార్లీ పంటలకు పిచికారీ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.ఇలా చేయడం వల్ల మూత్రంలో ఉండే పోషకాల వల్ల బార్లీ మరింత రుచిగా మారుతుందని వారి వాదన. ఇలా నాలుగేళ్లుగా ఈ సంస్థ మూత్రాన్ని ఎరువుగా వాడిన బార్లీతో బీర్లను తయారు చేస్తోంది.అందుకే ఈ సంస్థ తయారు చేసే బీరును రీసైక్లబుల్ బీర్ అని కూడా పిలుస్తుంటారు. మొదట్లో చాలామంది ఆ కంపెనీ బీర్ లను తాగడానికి వ్యతిరేకించారట.అసలు విషయం తెలిసిన తర్వాత ఈ బీరుకు మంచి డిమాండ్ ఏర్పడిందని ఓ సందర్భంలో బీరు తయారీ కంపెనీ వర్గాలు తెలియజేశాయి. ఇదండీ అసలు విషయం