సాధారణంగా మన ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే వారికి సరైన దిశా నిర్దేశాలు చేస్తాము.అయితే వయసుకు వచ్చిన పిల్లలను తల్లిదండ్రులు అదుపు చేయాలంటే కొంత కష్టంతో కూడుకున్న పని.వారి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా ప్రవర్తించడం వల్ల తల్లిదండ్రులు ఎంతో విసిగి పోతారు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల మాట వినడం లేదని ఆ కూతురుని ఎవరు లేనటువంటి ఒక దీవిలో వదిలి వచ్చిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
షాన్డాంగ్ ప్రావీన్స్ సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన జాలర్లకు సమీపంలోని ఒక దీవిలో 13 సంవత్సరాల బాలిక కనిపించింది. దీంతో బాలిక దగ్గరకు వెళ్ళిన జాలర్లు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ బాలికను అడగడంతో అసలు విషయం బయటపడింది. తను స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాననే కారణంతో తన తల్లిదండ్రులు ఆ దీవిలో వదిలి వెళ్లారని బాలిక తెలిపింది.
గత రెండు రోజుల నుంచి ఈ దీవీలోనే ఉంటున్నానని, ఇక్కడ ఎలాంటి విద్యుత్, నీటి సదుపాయాలు కూడా లేకపోవడంతో ఎంతో సతమతమవుతున్నాని తక్షణమే తనని నగరానికి తీసుకెళ్లాలని సదరు బాలిక జాలర్లను వేడుకుంది. దీంతో జాలర్లు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు పడవలో తన తల్లిదండ్రుల్ని దీవీ దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని తీసుకు వెళ్లవలసిందిగా చెప్పారు.తన కూతుర్ని అక్కడి నుంచి తీసుకు వెళ్లకపోతే ఆ తల్లిదండ్రుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో ఆ తల్లిదండ్రులు అయిష్టంగానే తమ కూతురి ఇంటికి తీసుకెళ్లారు.అయితే వారు కావాలనే తమ కూతురిని అక్కడ వదిలి వెళ్లలేదని, తన కూతురికి సరైన గుణపాఠం చెప్పడం కోసమే ఆ దీవిలో వదిలి వెళ్ళామని ఆ తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…