దారుణం: మనుషులు లేని దీవిలో ఒంటరిగా కూతురిని వదిలి వచ్చిన తల్లిదండ్రులు.. కారణం అదే!

0
172

సాధారణంగా మన ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే వారికి సరైన దిశా నిర్దేశాలు చేస్తాము.అయితే వయసుకు వచ్చిన పిల్లలను తల్లిదండ్రులు అదుపు చేయాలంటే కొంత కష్టంతో కూడుకున్న పని.వారి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా ప్రవర్తించడం వల్ల తల్లిదండ్రులు ఎంతో విసిగి పోతారు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల మాట వినడం లేదని ఆ కూతురుని ఎవరు లేనటువంటి ఒక దీవిలో వదిలి వచ్చిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

షాన్డాంగ్ ప్రావీన్స్ సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన జాలర్లకు సమీపంలోని ఒక దీవిలో 13 సంవత్సరాల బాలిక కనిపించింది. దీంతో బాలిక దగ్గరకు వెళ్ళిన జాలర్లు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ బాలికను అడగడంతో అసలు విషయం బయటపడింది. తను స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాననే కారణంతో తన తల్లిదండ్రులు ఆ దీవిలో వదిలి వెళ్లారని బాలిక తెలిపింది.

గత రెండు రోజుల నుంచి ఈ దీవీలోనే ఉంటున్నానని, ఇక్కడ ఎలాంటి విద్యుత్, నీటి సదుపాయాలు కూడా లేకపోవడంతో ఎంతో సతమతమవుతున్నాని తక్షణమే తనని నగరానికి తీసుకెళ్లాలని సదరు బాలిక జాలర్లను వేడుకుంది. దీంతో జాలర్లు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు పడవలో తన తల్లిదండ్రుల్ని దీవీ దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని తీసుకు వెళ్లవలసిందిగా చెప్పారు.తన కూతుర్ని అక్కడి నుంచి తీసుకు వెళ్లకపోతే ఆ తల్లిదండ్రుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో ఆ తల్లిదండ్రులు అయిష్టంగానే తమ కూతురి ఇంటికి తీసుకెళ్లారు.అయితే వారు కావాలనే తమ కూతురిని అక్కడ వదిలి వెళ్లలేదని, తన కూతురికి సరైన గుణపాఠం చెప్పడం కోసమే ఆ దీవిలో వదిలి వెళ్ళామని ఆ తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here