General News

వరుడు రెండో ఎక్కం చెప్పలేదని షాకిచ్చిన వధువు.. పెళ్లిపీటలపైనే?

సాధారణంగా పెళ్లి పీటల పై ఒక పెళ్లి ఆగింది అంటే అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. కట్నకానుకల విషయంలో, లేదా వరుడు ఇంకొక అమ్మాయిని ఇష్టపడటం, వధువు వేరే అబ్బాయిని ఇష్టపడటం, లేదంటే వధూవరులకు ఇష్టం లేకుండా పెళ్లి చేయడం వంటివి చేస్తున్న సమయాలలో కొన్ని పెళ్లిళ్లు పీటలపై ఆగిపోవడం మనం చూస్తుంటాము. కానీ పెళ్లి కొడుకు ఎక్కాలు చెప్పలేదని పెళ్లి ఆగిపోవడం ఎప్పుడైనా విన్నారా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ విచిత్రమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యావంతురాలైన యువతికి మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్ళి నిశ్చయించారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే పెళ్లి పీటల పై ఉన్న వరుడు పురోహితులు చెబుతున్న మంత్రాలను సరిగ్గా పలకకపోవడంతో వధువుకు అనుమానం వచ్చి ఎంతవరకు చదువుకున్నావ్ అంటూ వరుడిని ప్రశ్నించింది. అందుకు వరుడు తడబడటంతో ఆమెకు మరింత అనుమానం కలిగింది.

తనను చేసుకోబోయే యువకుడు చదువుకోలేదని సందేహం రావడంతో వధువు తనకు రెండవ ఎక్కాం అప్పజెప్పాలని చెప్పింది. వరుడు రెండవ ఎక్కం చెప్పకపోవడంతో, కనీసం రెండో ఎక్కం కూడా చెప్పడం రాని వాడిని ఏ విధంగా పెళ్లి చేసుకోవాలని భావించి ఈ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అప్పటికే బంధువులందరూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఆమె ఈ పెళ్ళికి ససేమిరా అంది.

వరుడిని పెళ్లి చేసుకోనని పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోవడంతో బంధువులు అందరూ షాక్ అయ్యారు.పెళ్లి కూతురు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె తీసుకున్న నిర్ణయం కూడా సరైనది అని భావించిన కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని రద్దు చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విజయ్–రష్మిక పెళ్లి రాజస్థాన్‌లో ఘనంగా.. అతిథులందరికీ ప్రత్యేక నిబంధనలు!

 సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…

8 minutes ago

మైసూర్ సిల్క్ మోజు.. ఒక్క చీర ధర లక్షల్లో… మహిళల భారీ రద్దీ!!

మైసూర్ పట్టు చీరల క్రేజ్… లక్షల ధరైనా వెనక్కి తగ్గని మహిళలు పట్టు చీర అంటే భారతీయ మహిళలకు ప్రత్యేకమైన…

13 minutes ago

మహాశివరాత్రి సందడి.. శ్రీశైలం మల్లన్న హుండీకి 13 రోజుల్లోనే రూ.5.61 కోట్లు!

మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…

43 minutes ago

“బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!”

పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…

59 minutes ago

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

2 hours ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

2 hours ago