ఏ పెళ్లి అయినా ఇద్దరి కుటుంబసభ్యుల అంగీకారంతో.. వరుడు, వధువు ఇష్టంతో చేసుకుంటారు. ఒక్కసారి పెళ్లి అయిందంటే.. నూరేళ్లు వాళ్లిద్దరు కలిసి ఉంటారు. వివాహ బంధం అనేది అన్ని బంధాల కంటే గొప్పది. అందరి సమక్షంలో తామిద్దరం ఒకటి అవుతున్నామంటూ.. ప్రమాణం చేస్తూ మరీ వధువు మెడలో తాళి కడతాడు వరుడు.
అయితే ఇక్కడ ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వరుడు.. వధువు మెడలో తాళి కడుతుంటే.. ఆ తాళిని తీసి నేలకోసి కొట్టింది ఓ వధువు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటన అక్కడ ఉన్న పెళ్లి కొడుకునే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె అలా చేయడానికి గల కారణం ఏంటో ఎవరికీ తెలియదు.
ఇలా అతడు తాళి కట్టేందుకు లేచి ఆమె మెడలో కట్టడానికి ప్రయత్నిస్తుండగా.. అతడి చేతిలో నుంచి తాళిని తీసుకొని విసిరి నేలకు కొడుతుంది. అలా ఆమె పెళ్లి మండపం నుంచి దిగి కొంచెం దూరం పోతుంది.. మళ్లీ నవ్వుకుంటూ తిరిగి అదే ప్లేస్ కు చేరుకుంటుంది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత అందరూ నవ్వుకున్నారు.ఆమె ప్రాంక్ చేసినట్లు చెప్పింది.
దీంతో అందరూ కొంచెం అయిష్టంగా ఫీల్ అయినా దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయాగ.. నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇదెక్కడి ఫ్రాంక్ రా బాబు.. మంగళ సూత్రంపై ఎవరైనా ప్రాంక్ చేస్తారా అంటూ ఆమెను తిడుతున్నారు. పెళ్లి గురించి.. పెళ్లి అంటే ఏంటో తెలిసిన వాళ్లు ఇలా చేయరంటూ.. ఘాటుగానే స్పందించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…